సినీ వర్కర్స్ సంక్షేమం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 లక్షల రూపాయల విరాళం

0
1127
Prabhas announced 50 Lakhs for Cine Workers

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పాటిస్తున్న లాక్ డౌన్ వలన షూటింగ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 ల‌క్ష‌ల రూపాయల విరాళం ప్ర‌క‌టించారు.

ప్రభాస్ ఇది వరకే కరోనా నిర్మూలన చర్యల కోసం పి ఎమ్ రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలకు 1 కోటి రూపాయలు ( 50 లక్షల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ సీ ఎమ్ సహాయ నిధికి, 50 లక్షల రూపాయలు తెలంగాణ సీ ఎమ్ సహాయ నిధికి) సహాయం అందించారు. ఈ రోజు ‘క‌రోనా క్రైసిస్ చారిటీ‘ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రకటించిన 50 లక్షల రూపాయల విరాళం తో ప్రభాస్ కరోనా పై పోరాటానికి 4 కోటి 50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here