కరోనా విపత్తు నిధికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరొక రూ. 20 లక్షల విరాళం…!!

0
807
Allu Arjun announced 20 Lakhs

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తోన్న కరోనా వ్యాధిని అడ్డుకోవడానికి అన్ని దేశాలతో పాటు మన దేశాన్ని కూడా 21 రోజులు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని వలన ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమం కోసం తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ కి హీరోలు అందరూ విరాళాలు అందిస్తున్నారు.

ఇక ఇప్పటికే రూ.1.25 కోట్లు కరోనా బాధితులకు తనవంతు సాయం అందించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాసేపటి క్రితం కరోనా విపత్తు నిధికి మరొక రూ.20 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనితో మొత్తంగా బన్నీ రూ.1.45 కోట్లు విరాళం అందించడం జరిగింది. ఈ విధంగా మంచి మనసుతో ప్రజలను ఆదుకుంటున్న సినిమా ప్రముఖుల పై పలువురు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here