సినీ కార్మికుల కోసం రూ.30 లక్ష‌లు విరాళ‌మిచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌

0
1148
Ramcharan donates 70 Lakhs

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్ డౌన్‌. సినీ ప‌రిశ్ర‌మంతా స్తంభించిపోయింది. ఈ త‌రుణంలో పేద సినీ కార్మికులను కాపాడ‌టానికి సినీ ప్ర‌ముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ’క‌రోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ సినీ క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని సూచించారు.

సి.సి.సి ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి 70 లక్షలు వితరణ చేసిన మెగాపవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు రూ.30 ల‌క్ష‌ల విరాళాన్ని సినీ కార్మికుల సహాయ నిధికి అంద‌చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here