కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో తన వంతు భాగస్వామ్యం అందించాలని హీరో నితిన్ నిర్ణయించుకున్నారు. కరోనా కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ప్రశంసించిన ఆయన, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో 10 లక్షల రూపాయల విరాళాన్ని నితిన్ ప్రకటించారు. మార్చి 31వ తేదీ వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలనీ, అందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండి, కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడంలో పాలు పంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.