తెలుగు సినీ చరిత్రలో గాని, తెలుగు సినిమా పరిశ్రమలో కానీ సువర్ణ అక్షరాలతో లిఖించ దగిన దర్శకులు ఎవరైనా ఉన్నారంటే అది కళాతపస్వి, తెలుగు సినీసువర్ణ దిగ్గజ దర్శకులు, చరిత్ర సృష్టించిన తెలుగు నాట లెజెండరీ దర్శకులు శ్రీ కె.విశ్వనాథ్ గారే అని చెబుతుంది సినీ చరిత్ర. `అన్నపూర్ణమ్మ గారి మనవడు` చిత్రానికి ఆయన ఇచ్చిన ప్రశంస ఏంటంటే..
“ఉగాది పచ్చడి లాంటి తెలుగింటి చిత్రం“ అని కళా తపస్వి, సువర్ణ దర్శకులు శ్రీ కె.విశ్వనాథ్ గారు ప్రశంసించడం చాలా గొప్ప విశేషం. ఇంకా ఆయన మాటల్లో దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు నన్ను కలిశాడు. ఆయన చేసిన `అన్నపూర్ణమ్మ గారి మనవడు` ప్రాజెక్టు గురించి చెప్పాడు. పోస్టర్, డిజైన్స్ చూపించాడు. పోస్టర్, డిజైన్స్ చూడముచ్చటగా ఉన్నాయి. టైటిల్ లో అచ్చమైన తెలుగుదనం ఉంది. పోస్టర్, డిజైన్స్ లలో అసభ్యత, అశ్లీలత లేదు. స్వచ్ఛమైన పచ్చని తెలుగు పల్లెటూరు గుర్తుకువచ్చింది. పైగా పోస్టర్లలో జమున గారిని చూసాక నేను ఆశ్చర్య పోయాను. జమున గారు నటించారా? అని అడిగాను. అవును గురువు గారు అని శివనాగేశ్వరరావు వినయంగా చెప్పాడు. సంతోషించాను, అప్పుడే అర్ధం అయింది. దర్శకుడి మనసులో ఎంత స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నాయో అని. ఆయన మేకింగ్ లో ఒక నాణ్యత, సీన్ వివరించడంలో ఒక క్లారిటీ ఉన్నాయి. ఉమ్మడి కుటుంభం మీద తీసుకున్న కథలోని సన్నివేశాలని చక్కగా ప్రెజంట్ చేశారు. అందరూ సీనియర్ నటీనటులతో చాలా మంచి చిత్రాన్ని తీసిన దర్శకులు నర్రా శివనాగేశ్వర రావు గారిని నేను అభినందిస్తూ `అన్నపూర్ణమ్మ గారి మనవడు` మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.