ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాగా, వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే నేడు ఆ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు త్రిష అధికారికంగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
కొన్ని క్రియేటివ్ కారణాల వలన చిరంజీవి గారి సినిమా నుండి తప్పుకుంటున్నాను, ఆ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను, అలానే అతి త్వరలో మరొక ప్రాజక్ట్ తో మీ ముందుకు వస్తాను అంటూ హీరోయిన్ త్రిష తన ఫ్యాన్స్ కు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేసారు. దీనితో ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వెల్లడైంది. మెగాస్టార్ ఒక పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాని ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం….!!