ఉగాది కానుకగా వ‌స్తోన్న‘ఒరేయ్‌ బుజ్జిగా…`మంచి విజ‌యం సాధించాలి – మొబైల్ పబ్లిసిటి ప్రారంభ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్.

0
461
Orey bujjiga publicity

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా మొబైల్ పబ్లిసిటి అనే ఒక కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లు కలిగిన వాహనాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలలో తిరుగుతాయి. వీటిని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ – “ఒరేయ్ బుజ్జిగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో అనూప్ రూబెన్స్ సంగీతసారథ్యంలో రాధామోహన్‌గారు ఒక బ్రహ్మాండమైన మూవీని నిర్మించి ఉగాది కానుకగా మార్చి 25నవిడుదలచేస్తున్నారు. మొబైల్ పబ్లిసిటి అనే నూతన టెక్నాలజీ కి కూడా అంకురార్పణ చేశారు. ప్రస్తుత కాలంలో ఈ మొబైల్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరమైనది. తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ఎక్కువ జనసందోహం ఉంటుందో అక్కడ వాహ‌నాల ద్వారా ఈ పబ్లిసిటి చేస్తారు. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత కె.కె రాధామోహ‌న్ గారికి, దర్శకుడు కొండా విజయ్ కుమార్, రాజ్ తరుణ్, మాళవిక నాయర్, జె మీడియాన‌రేంద‌ర్‌గారికి నా అభినందలు. అలాగే నిర్మాత రాధామోహ‌న్ గారు తీసిన `ఏమైంది ఈవేళ`, `అధినేత`, `బెంగాల్ టైగర్`, `పంతం` చిత్రాలు చూశాను. మంచి అభిరుచి గ‌ల నిర్మాత. రాధా మోహ‌న్ గారికి ఈ సినిమా పెద్ద‌ హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. అలాగే తమ్మడు రాజ్ తరుణ్ ని `ఉయ్యాలా జంపాల` నుండి ప్రజలందరూ బాగా ఆద‌రిస్తున్నారు. మాళవిక నాయర్ కి ఐదవ చిత్రం వీరితో పాటు టీమ్ అందరికి నా శుభాకాంక్షలు. ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతకి మంచి డబ్బులు రావాలి. అలాగే భవిష్యత్ లో కూడా ఇంకా మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here