‘టాక్సీవాలా’ సూపర్ హిట్ అవడం చాలా హ్యాపీగా ఉంది – హీరోయిన్ మాళవిక నాయర్

1
624

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఆనంది గా తెలుగు తెరకు పరిచయం అయ్యి మహానటి,విజేత లాంటి సూపర్‌హిట్‌ సినిమాలతో తనని తాను ప్రూవ్‌ చేసుకొని మళ్ళీ ఇప్పుడు టాక్సీవాలా లాంటి ఒక హైఫై సూపర్‌ న్యాచ్యురల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో ‘సిసిర’ లాంటి ఒక ఇంటెన్స్‌ క్యారెక్టర్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న భామ ”మాళవిక నాయర్‌” తో ‘ఇండస్ట్రీ హిట్‌’ ఇంటర్వ్యూ.

‘టాక్సీవాల’ సక్సెస్‌ను ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు?
– నేను ఈసినిమాను థియెటర్‌ లో రెండు సార్లు చూశాను. మొదటి సారి చాలా ఇంటెన్స్‌ ఫీల్‌ అయ్యాను. కాని రెండోసారి థియెటర్‌ లో ఆడియన్స్‌ అరుపులకు థ్రిల్‌గా ఫీల్‌ అయ్యాను. ఏ నటికి అయినా సక్సెస్‌ అనేది తనలోని కాన్ఫిడెంట్‌ను పెంచుతుంది. అలా ‘టాక్సీవాల’ విజయంతో నా రాబోయే సినిమాల స్క్రిప్ట్స్‌ విషయంలో నేను కోంత సెలక్టివ్‌గా ఆలోచించగలను అనుకొంటున్నాను.

జిఎ2, యూవీ క్రియేషన్స్‌ లాంటి గొప్ప బ్యానర్‌లో హీరోయిన్‌గా ఛాన్స్‌ రావడం ఎలా అనిపించింది?
– చాలా చాలా హ్యాపీ! అంత పెద్ద బ్యానర్స్‌ లో విజయ్‌ దేవరకొండ లాంటి హీరోతో నటించడం,సినిమా సూపర్‌ హిట్‌ అవడం మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ప్రొడ్యూసర్‌ ఎస్‌ కె ఎన్‌ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ యూనిట్‌ తో పని చేయడం ఒక స్వీట్‌ ఎక్స్‌పీరియన్స్‌.

ఈ సినిమాలో మీపాత్ర నిడివి తక్కువగా ఉందికదా?
– నేను సినిమాలో నాపాత్ర నిడివిగురించి పెద్దగా పట్టించుకోను. ఆ పాత్ర సినిమాకు ఎంత కీలకం, ఆక్యారెక్టర్‌ ద్వారా నాలోని విభిన్నమైన నటిని ఎలా బయటకు తీసుకురావాలి, నా యాక్టింగ్‌ ద్వారా ఆడియన్స్‌ ను ఎలా మెప్పించగలను అని ఆలోచించి క్యారెక్టర్స్‌ ఓకె చేస్తాను.

ఈ సినిమా లో మీ క్యారెక్టర్‌?
– సినిమాలో నాక్యారెక్టర్‌ లేకుండా కథను మనం ఊహించలేము. అలాంటి ఇంపార్టెన్స్‌ ఉన్న క్యారెక్టర్‌. టాక్సీవాలా సినిమాకు సిసిర క్యారెక్టర్‌ సోల్‌ ఆఫ్‌ ది ఫిలిమ్‌. అలాంటి క్యారెక్టర్‌ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాను.

ఆనంది,దివ్య,సిసిర లాంటి క్యారెక్టర్స్‌మీ కెరీర్‌కు ఖచ్చితంగా హెల్ప్‌ అవుతాయి అనుకుంటున్నారా?
– ఆనంది క్యారెక్టర్‌ తెలుగులో నా ఫేవరేట్‌. ఇలాంటి క్యారెక్టర్స్‌ చేయడం ద్వారా నేను తెలుగులో టాప్‌ హీరోయిన్‌ అవుతానని అనుకోవడంలేదు. కానీ ఒక నటిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే అవకాశం మాత్రందక్కింది అనుకుంటున్నాను. నా కెరీర్‌ స్టార్టింగ్‌ లోనే సిసిరా లాంటి ఒక ఇంటెన్స్‌ క్యారెక్టర్‌ చేయడం కొంత రిస్క్‌ అనే చెప్పాలి. కానీ ఆడియన్స్‌ నేను చేసే ప్రతీ క్యారెక్టర్‌ను యాక్సప్ట్‌ చేయగలగాలి. అప్పుడే ఒక నటిగా నేను ప్రశాంతంగా నిద్రపోగలను.

టాక్సీవాలా కంటే ముందు ‘విజేత’ రిలీజ్‌ అయ్యింది కదా?
– అవును! టాక్సీవాలా ఒప్పుకుని దాదాపు రెండు సంవత్సరాలు దాటింది. అందుకే విజేత సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని ముందుగా రిలీజ్‌ అయ్యింది

ఫ్యూచర్‌ లో ఎలాంటి క్యారెక్టర్స్‌ చేయాలనుకుంటున్నారు?
– నటనతో మంచి స్కోప్‌ ఉండి నాకు ఛాలెంజింగ్‌గా అనిపించే ప్రతీ క్యారెక్టర్‌ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అలా అని అన్నీ ఛాలెంజింగ్‌ క్యారెక్టర్స్‌ చేస్తానని కాదు..నా కెరీర్‌ కు ఇంపార్టెన్స్‌ ఇస్తూనే ఒక నటిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోగలిగే క్యారెక్టర్స్‌ చేస్తాను.

ఇంత వరకు కమర్షియల్‌ సినిమాలు ఎందుకు చేయలేదు?
– ఈ మధ్యనే ఒక కమర్షియల్‌ మూవీను రిజెక్ట్‌ చేయడం జరిగింది. కారణం కమర్షియల్‌ మూవీస్‌లో హీరోయిన్స్‌ కు అంత ప్రాధాన్యం ఉండదు. మంచి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ వస్తే కమర్షియల్‌ మూవీస్‌లో నటించడానికి నేను ఎప్పుడూ సిద్దమే.

మీటూ గురించి?
– ఫిమేల్‌ జెండర్‌ని హారాష్‌ చేయడం అనేది టాలీవుడ్‌ లోనే ఉందని నేనుఅనుకోవడం లేదు. ఇది ప్రతీ ఇండస్ట్రీలో ఉంది. కొంత ఆలస్యం అయినా టాలీవుడ్‌ లో ఇది స్టార్ట్‌ అయినందుకు హ్యాపీ గా ఉంది. పర్సనల్‌గా నాకు అలాంటి సంఘటనలు ఏమి ఎదురు కాలేదు. బహుశా కారణం చిన్న వయసునుండి మా పేరెంట్స్‌ నాకు తోడుగా షూటింగ్‌కు రావడం అనుకుంటా.

ప్రజెంట్‌ కాలేజీ కి వెళ్తునట్టున్నారు?
– అవునండి! బేగంపేట్‌ లోని ఫ్రాన్సిస్‌ కాలేజీ లో హిస్టరీ,లిటరేచర్‌ ఇన్‌పొలిటికల్‌ సైన్స్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. కాలేజీలో నా ఫ్రెండ్స్‌ అందరూ విజయ్‌ గురించి, నా తదుపరి చిత్రాల గురించి అడగడం చాలాసంతోషంగా అనిపిస్తుంది. నా సినిమా లైఫ్‌,పర్సనల్‌ లైఫ్‌ వేరుగా,హ్యాపీగాఉండాలి అనుకొంటున్నాను.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి?
– తమిళ్‌లో ఒక సినిమా చేస్తున్నాను షూటింగ్‌ త్వరలోనే స్టార్ట్‌ అవుతుంది. తెలుగులో ఒక సినిమా ఉంది. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

http://industryhit.com/t/2018/11/malavika-nair-pics-4/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here