ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ ‘వకీల్ సాబ్‘. దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తరువాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ‘వకీల్ సాబ్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సూపర్బ్ రెస్పాన్స్ ని సంపాదించింది. నేడు కాసేపటి క్రితం సినిమాలోని ఫస్ట్ సాంగ్ ఆయిన ‘మగువ మగువ’ అనే పల్లవితో సాగె సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. యువ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ కు ఎస్ ఎస్ థమన్ అదిరిపోయే ట్యూన్ ని అందించినట్లు ఈ ప్రోమో ని బట్టి చూస్తే తెలుస్తోంది.
కాగా ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఫుల్ సాంగ్ ని అదేరోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా మే నెలలోఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది….!!


