‘దండుపాళ్యం’ దర్శకుడు శ్రీనివాసరాజు రూపొందిస్తున్న మరో డిఫరెంట్‌ మూవీ ‘18+ సినిమా’.

0
757

లవర్స్‌, కేరింత చిత్రాల హీరో సుమంత్‌ అశ్విన్‌ కథానాయకుడిగా, సలోని మిశ్రా కథానాయికగా.. దర్శకుడు శ్రీనివాసరాజు ‘దండుపాళ్యం 1, 2, 3’ చిత్రాల తర్వాత రూపొందిస్తున్న డిఫరెంట్‌ మూవీ ‘18+ సినిమా’. జ్యోస్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మకరంద్‌ దేశ్‌పాండే, సప్తగిరి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్‌ తమిళనాడులోని తిరువల్లూరులో వేసిన సెట్‌లో మార్చి 11 నుంచి 20 వరకు జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.

సుమంత్‌ అశ్విన్‌, సలోని మిశ్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మకరంద్‌ దేశ్‌పాండే, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, నిర్మాత: ఎం.కోటేశ్వరరాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here