కొత్త కాన్సెప్ట్‌తో చేసిన హిట్‌ చిత్రాన్ని ఆద‌రించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు – నిర్మాత నాని

0
715

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందిర చిత్రం `హిట్‌`. `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌లైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో…

నిర్మాత నాని మాట్లాడుతూ – ‘‘ఈరోజు ఉద‌యం హిట్ సినిమా మాది.. హిట్ అయితే మీది అని మెసేజ్ పోస్ట్ చేశాను. ఇప్పుడు సినిమా హిట్ కావ‌డంతో సినిమా మీది(ప్రేక్ష‌కులు)గా మీరు తీసుకున్నారు. టీమ్ అంద‌రం హ్యాపీగా ఉన్నాం. డెబ్యూ డైరెక్ట‌ర్ అయినా అంద‌రూ శైలేష్ బాగా చేశాడ‌ని అంద‌రూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే అంద‌రూ విశ్వ‌క్ పెర్ఫామెన్స్ గురించి అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా గ‌ర్వంగా ఉంది. రుహానీ త‌క్కువ స్క్రీన్ స్పేస్‌లోనే అద్భుతంగా న‌టించింది. వాల్‌పోస్ట‌ర్ మీద ఇంత క్వాలిటీ ప్రొడ‌క్ట్‌ను చేసి మేం చేసిన ప్రామిస్‌ను నిల‌బెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. కొత్త కంటెంట్‌ను పెద్ద‌గా ఎంక‌రేజ్ చేయ‌ర‌ని చాలా మంది భ‌య‌పెట్టారు. కానీ నేను ప్రేక్ష‌కుల‌ను న‌మ్మి సినిమా చేశాను. ఆ న‌మ్మ‌కం ఈరోజు నిజ‌మైంది. రివ్యూలు బాగా వ‌చ్చాయి. ఈ సినిమాలో వ‌చ్చిన చిన్న పాటి త‌ప్పుల‌ను కూడా నెక్ట్స్ సినిమాలో లేకుండా చూసుకుంటాం. హిట్ కేస్ 2 ని నేనే నిర్మిస్తున్నాను. ఆల్రెడీ మంచి క‌థ‌ను శైలేష్ సిద్ధం చేశాడు. ప్ర‌తి పాత్ర నాకు బాగా న‌చ్చింది. అన్నీ చ‌క్క‌గా కుదిరాయి. అందుకే మంచి క్వాలిటీ ప్రొడక్ట్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇదే టాక్ కంటిన్యూ అయితే సినిమా నెక్ట్స్ రేంజ్‌కు రీచ్ అవుతుంది. దాంతో హిట్ 2 పై మ‌రింత బాధ్య‌త పెరుగుతుంది. పైర‌సీని ఎంక‌రేజ్ చేయ‌కండి’’ అన్నారు.

హీరో విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ – ‘‘నాని క‌మ‌ర్షియ‌ల్ కంటెంట్‌తో సినిమా చేసి క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కొట్టావంటూ నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. ప్రేక్ష‌కులు న‌మ్మారు. థియేట‌ర్స్ జాత‌ర‌లాగా ఉన్నారు. అంద‌రూ కాన్‌స‌న్‌ట్రేష‌న్‌గా సినిమా చూస్తున్నారు. థియేట‌ర్స్ వెళ్లి వ‌చ్చాం. టెరిఫిక్ స‌క్సెస్ అయ్యింది. నా పాత్ర‌ను ఎంజాయ్ చేశాను. ఇప్పుడు థియేట‌ర్‌లో చూసి అదే ఫీలింగ్ క‌లిగింది. మ‌ణికంద‌న్‌గారికి, వివేక్ సాగ‌ర్‌కి, ప్ర‌శాంతిగారికి, రుహానీ స‌హా అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

శైలేష్ కొల‌ను మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన అందరికీ ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో విశ్వేశ్వ‌ర్‌, రుహానీ శ‌ర్మ‌, మ‌ణికంద‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here