మాస్‌ క్యారెక్టర్‌లో ధ్రువ

0
1018

సస్పెన్స్‌ థ్రిల్లర్ గా రూపొందిన ‘యం6’ చిత్రం ద్వారా పరిచయమైన ధ్రువ తన పెర్‌ఫార్మెన్స్‌తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఫిబ్రవరి 29 హీరో ధ్రువ పుట్టినరోజు.

ఈ సందర్భంగా తన తదుపరి చిత్రానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ‘‘హీరో కావాలనేది నా చిన్నప్పటి నుంచి వున్న కోరిక. అది ‘యం6’ ద్వారా నెరవేరింది. నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు గారు ఒక మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్ ద్వారా నన్ను హీరోగా పరిచయం చేశారు. ఆ సినిమాలో నా పెర్‌ఫార్మెన్స్‌ నచ్చడంతో తమ బేనర్‌లోనే నేను హీరోగా మరో సినిమా ప్లాన్‌ చేస్తున్నారు విశ్వనాథ్‌. ఈ సినిమాకి నిర్మాతగానే కాదు, దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపడుతున్నారు. నా పుట్టినరోజు నాలుగు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. నేను హీరో అయిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు ఇది. నా పుట్టినరోజు సందర్భంగా నా తదుపరి సినిమా వివరాలను తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంది. నటనకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్స్‌ చేస్తూ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. విశ్వనాథ్‌గారి స్వీయ దర్శకత్వంలో నిర్మించే సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మాస్‌ క్యారెక్టర్‌లో నటించబోతున్నాను. ఒక సరికొత్త పాయింట్‌తో చక్కని మెసేజ్‌తో ఈ సినిమా ఉంటుంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here