గుంటూరులో ‘సరిలేరు నీకెవ్వరు’ ధియేటర్ రికార్డ్

0
435

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కా బాప్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు‘. యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, ఏ కె ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెనకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ సినిమా మొన్నటి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ ని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ ని అందుకున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిచగా లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించి మెప్పించారు.

ఇక బ్లాక్ బస్టర్ కా బాప్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 44 రోజులకి గుంటూరు నగరంలోని నాజ్ థియేటర్ లో ఏకంగా రూ.62 లక్షల గ్రాస్ కలెక్షన్ ని అందుకుని ధియేటర్ రికార్డు ని నెలకొల్పింది. ఇప్పటికే ఈ సినిమా 50 రోజులకు చేరువ అవుతున్నప్పటికీ కొన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్ సాధిస్తు, ముఖ్యంగా వీకెండ్స్ లో చాలా బాగా కలెక్షన్లు రాబడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here