టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా భీష్మ. యంగ్ హీరో నితిన్, బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్నల కలయికలో మంచి కాన్సెప్ట్ తో పలు ఎంటర్టైనింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో ప్రస్తుతం రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ పై ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భీష్మ టీమ్ కు అభినందనలు తెలుపగా, నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీష్మ టీం ను ప్రత్యేకంగా అభినందించారు.
ఏకంగా పవర్ స్టార్ గారు మా సినిమాను మెచ్చుకుని భీష్మ టీమ్ కు ఈ విధంగా అభినందనలు తెలపడం నిజంగా ఎంతో ఆనందంగా ఉందని, ఇది తమ జీవితంలో అత్యంత మధురమైన ఘట్టంగా హీరో నితిన్, దర్శకుడు వెంకీ, నిర్మాత సూర్యదేవర నాగవంశీ పవర్ స్టార్ తో దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఆనందంతో పోస్ట్ చేస్తూ తెలిపారు.