` ప్రెజర్ కుక్కర్` ఒక న్యూ ఏజ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ – హీరోయిన్ ప్రీతీ అస్రాని.

0
1339

సాయి రోనక్, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా సుజోయ్ అండ్ సుశీల్ దర్వకత్వంలో తెరకెక్కిన చిత్రం` ప్రెజర్ కుక్కర్`. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న అభిషేక్ పిక్చ‌ర్స్ ద్వారా గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది. ఈ సంధర్భంగా హీరోయిన్ ప్రీతీ అస్రాని ఇంట‌ర్వ్యూ..

నేపథ్యం!
– నేను గుజరాత్ అమ్మాయిని, సినిమాలపై ఆసక్తితో నటిగా మారాను. మా క‌జిన్‌ అక్క అంజు ఓ టీవీ యాక్ట్రెస్, ఆమె స్ఫూర్తి తోనే నేను సినిమాలలోకి రావడం జరిగింది. గుజ‌రాత్‌లో స్కూలింగ్ అయిపోగానే ఇక్క‌డికి వ‌చ్చి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అలాగే రానా ద‌గ్గుపాటి గారి సోష‌ల్ వెబ్ సిరీస్ చేశాను. త‌ర్వాత ‘మళ్ళీ రావా’ సినిమాలో ఒక మంచి క్యారెక్ట‌ర్ చేశాను,అలాగే పక్కింటి అమ్మాయి అనే ఓ సీరియల్ లో కూడా నటించడం జరిగింది. హీరోయిన్ గా ఇది నా మొదటి చిత్రం.

అందుకే ఈ టైటిల్!
– ఈ టైటిల్ విన్నప్పుడు నాకు గమ్మత్తుగా అనిపించింది. బీటెక్ అపోయిన ఓ స్టూడెంట్ పై పేరెంట్స్, బంధువులు, స్నేహితుల నుండి అనేక ఒత్తిడులు ఉంటాయి. అతను అమెరికా వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలనే ధోరణి వారిలో ఉంటుంది. దీని కారణంగా హీరో ప్రెజర్ కుక్కర్ లో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే ఈ టైటిల్ పెట్టాము.

ఇండిపెండెంట్ స్ట్రాంగ్ అమ్మాయి!
– ఒక యంగ్ బాయ్ కిషోర్ మీద చాలా ప్రెజర్స్ ఉంటాయి. చదువు అయిపోగానే అమెరికా వెళ్ళాలి అని అలాగే మంచి ఉద్యోగం చెయాలని…చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అనిత, ఒక సోషల్ యాక్టీవిస్ట్ గా కనిపిస్తాను, అలాగే ఇండిపెండెంట్ స్ట్రాంగ్ అమ్మాయిలా నా పాత్ర ఉంటుంది. హీరో కిషోర్ పాత్రకు విరుద్ధంగా అనిత పాత్ర ఉంటుంది.

కామెడీ, లవ్, ఎమోషన్స్!
– ప్రెజర్ కుక్కర్ మూవీలో అని అంశాలు ఉంటాయి. కామెడీ, లవ్, ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలు ఉంటాయి. సినిమా వాస్తవానికి దగ్గరగా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఒక న్యూ ఏజ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌.

కష్టపడి డబ్బింగ్ చెప్పుకున్నాను!
– ఈ సినిమాలో పాత్రకు నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాను . తెలంగాణ స్లాంగ్ నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పడం జరిగింది. రెండు మూడు టేక్ లు తీసుకున్నప్పటికీ కష్టపడి పూర్తి చేశాను.

సిటీమార్ లో కబడ్డీ టీం కెప్టెన్!
– ఈసినిమా త‌ర్వాత గోపించంద్ గారి సిటీమార్ సినిమాలో ఓ రోల్ చేస్తున్నాను. ఆ సినిమాలో నేను ఓ కబడ్డీ టీం కెప్టెన్ గా కనిపిస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here