‘వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంలో ఆడియ‌న్స్‌కి ఒక స్వీట్ సర్ప్రైజ్ ఉంది – హీరోయిన్ రాశీ ఖన్నా

1
1486

వెంకీమామ, ప్రతి రోజు పండగే చిత్రాలతో వరుసగా సూపర్ సక్సెస్ ని అందుకుంది రాశిఖన్నా. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్‘. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మిస్తున్నారు. విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వేలంటైన్స్ డే పిబ్ర‌వ‌రి 14న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది ఈ సంద‌ర్భంగా హీరోయిన్ రాశీ ఖన్నా మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు..

ఛాలెంజింగ్ క్యారెక్టర్ !!
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నేను ఇప్పటి వరకు చేసిన చిత్రాలతో పోలిస్తే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఆ విషయం ఇప్పటికే ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్ధం అయి ఉంటుంది. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఈ సినిమా కథ గురించి చెప్పాలి అందుకే ఇది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని మాత్రమే ఇప్పుడు చెప్పగలను. అలాగే టీజ‌ర్‌, ట్రైలర్ చూసి ఈ సినిమా కథ ఇది అయి ఉండొచ్చు అని చాలా రకాలుగా అనుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఇదొక స్వీట్ సర్ప్రైజ్ లా ఉండబోతుంది.

నా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే పాత్ర!!
ఈ సినిమాలో పాత్ర పేరు యామిని. ప్రతి అమ్మాయిలోనూ ఒక యామిని ఉంటుంది అని నా ఫీలింగ్. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. నేను ఇప్పటివరకు ఏ క్యారెక్టర్ తో రిలేట్ అవ్వలేదు. కానీ యామిని క్యారెక్టర్ కి రిలేట్ అయ్యాను. నా రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉండే పాత్ర. ఇది ఒక ఎమోషనల్ సినిమా కాబట్టి మేము కూడా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం.
ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ సైడ్ ఉంటుంది!!

నా దృష్టిలో అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ సైడ్ ఉంటుంది. అయితే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్న అమ్మాయిలు మాత్రమే ఆ ఎమోషన్ ని అందరి ముందు చూపించుకోరు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా ఇదే. ఆ క్యారెక్టర్ కి అంతగా రిలేట్ అయ్యాను కాబట్టే కేవలం రెండు రోజుల్లో డబ్బింగ్ చెప్పగలిగాను.

విజయ్ ఒక న్యూ థీమ్ ని ట్రై చేశాడు!!
రేపు సినిమా విడుదలయ్యాక ఈ మూవీ కి టైటిల్ యాప్ట్ అని మీరే నమ్ముతారు. విజయ్ థియేటర్ బ్యాక్ గ్రౌడ్ నుండి వచ్చారు అని నాకు ముందు తెలీదు. ఈ సినిమా షూటింగ్ లో ఒక సందర్భంలో తనే చెప్పారు. అందుకే విజయ్ ఏ ఎమోషన్ ని అయినా ఈజీ గా పలికించగలరు. తనతో వర్కింగ్ చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో విజయ్ ఒక న్యూ థీమ్ ని ట్రై చేశాడు. ఎలాంటి సందర్భంలో అయినా విజయ్ అస్సలు భయపడరు. అందుకే ఆయన క్యారెక్టర్ కి అందరూ కనెక్ట్ అవుతారు. రేపు రిలీజ్ తరువాత అందరూ ఈ సినిమా గురించే మాట్లాడతారు.

ఫాబ్యులెస్ గా పెర్ఫామ్ చేసింది!!
ఈ క్యారెక్టర్ కాకుండా ఈ మూవీలో మరో పాత్ర చేసే అవకాశం ఉంటే తప్పకుండా ఐశ్వర్య రాజేష్ చేసిన క్యారెక్టర్ ఎంచుకునేదాన్ని. తను కూడా ఫాబ్యులెస్ గా పెర్ఫామ్ చేసింది.

అద్భుతంగా తెరకెక్కించారు!!
క్రాంతి గారు ఈ సినిమా నరేట్ చేస్తున్నపుడు నేను వేరే లోకానికి వెళ్ళాను అనిపించింది. నేను చాలా ఎమోషన్ పర్సన్ కి కాబట్టి ఒకరకంగా చెప్పాలంటే ఏడ్చాను. అంతగా ఈ స్క్రిప్ట్ తో కనెక్ట్ అయ్యాను. క్రాంతి గారు కూడా అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు.

వేలంటైన్ డే అంటే చాలా ఇష్టం!!
చాలా మందికి వేలంటైన్ డే అంటే ఇష్టం ఉండదు. కానీ నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం తెలుగులో రెండు స్క్రిప్ట్స్ వింటున్నాను ఇంకా ఫైనల్ కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here