‘జాను’వంక పెట్ట‌లేని హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ – హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు

0
726

యంగ్ హీరో శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ ‘జాను’.ఈ సినిమాను ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవబోతున్న సందర్భంగా హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఇంటర్వ్యూ.

96 మూవీని రీమేక్ చేయడానికి రీజ‌న్ ఏంటి?
– రీమేక్ చేయాలంటే ఒక ఎక్స్ట్రార్డినరీ ఫీలింగ్ రావాలి. దిల్ సినిమా నుండి స్క్రిప్ప్స్‌తో ట్రావెల్ అవుతుండ‌డం వ‌ల్లో ఏమో అందులో ఏదో మ్యాజిక్ ఉంది అనిపించి ఇన్ని సంవ‌త్స‌రాలు రీమేక్స్ జోలికి వెళ్ళలేదు. ఈమద్యలో `ప్రేమమ్`, `బెంగుళూర్ డేస్` లాంటి ఫీల్ గుడ్ మూవీస్ ని రీమేక్ చేయాలనిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. కాని ఈ ఏడాది అనుకోకుండా 96 తమిళ మూవీని `జాను`గా తెలుగులో, తెలుగు `జెర్సీ`ని హిందీలో, హిందీ మూవీ `పింక్`ని తెలుగులోరీమేక్ చేస్తున్నాం, ఇలా మొత్తం మూడు రీమేక్ సినిమాలు చేస్తున్నాం.

రీమేక్ చేసేట‌ప్పుడు మాతృక‌లోని మేజిక్ క్రియేట్ అవుతుందో కాదోన‌నే టెన్ష‌న్ ఫీల‌య్యారా?
– నేను చేసిన మంచి పనేంటంటే త‌మిళ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమార్‌నే ఈ సినిమాకు తీసుకురావ‌డం. హ‌లోగురు ప్రేమ‌కోస‌మే కెమెరామెన్ విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి నేను 96 సినిమా చూడ‌టానికి చెన్నై వెళుతున్నాన‌ని తెలియ‌గానే.. ఆ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారు? మ‌న ఆర్య సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా ప‌నిచేశాడ‌ని చెప్పాడు. ప్రివ్యూ చూసిన‌ప్పుడు నిర్మాత‌తో పాటు డైరెక్ట‌ర్‌తోనూ మాట్లాడాను. మీకు ఆస‌క్తి ఉంటే తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పాను. త‌మిళంలో సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌తో క‌లిసి చూశాను. ఆ స‌మ‌యంలో డైరెక్ట‌ర్‌తో నువ్వు సినిమా చెయ్యాల‌ని అన్నాను.

ఈ సినిమా రీమేక్ హక్కులు ఎలా దక్కించుకున్నారు?
– 96 మూవీ టీజర్ నాకు తెలిసిన వారు పంపిస్తే చూశాను. అప్పుడే బాగుంది అని ఒక ఇంట్రెస్ట్ కలిగింది. ఆ రోజు నుండి ఆ మూవీ ని ఫాలో చేశాను. అలా విడుదలకు ముందే నిర్మాతతో కలిసి సినిమా చూశాను. నాకు తమిళ్ అంత బాగా అర్ధం కాదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ మూమెంట్స్, సీన్స్ బాగా ఎక్కేశాయి. నాకు తెలియకుండానే ఒక మ్యాజిక్ క్రియేట్ అయింది. సినిమా అయిపోయిన వెంటనే నాకు తెలుగు రీమేక్ హక్కులు కావాలని అడిగాను. ఆయన అడిగిన ఎమౌంట్ కి 10 లక్షలు తక్కువ ఇచ్చాను. హిట్ ఐతే మరో పాతిక లక్షలు ఇస్తాను అని అన్నాను. సినిమా పెద్ద హిట్ అయింది. నేను మాట ఇచ్చిన ప్రకారం తగ్గించిన 10లక్షలకు మరో15 లక్షలు కలిపి మొత్తం 25లక్షలు ఇచ్చాను.

మీకు పర్సనల్ గా బాగా కనెక్ట్ అయిందా?
– పర్సనల్ లైఫ్ లో నాకు ఇలాంటి స్టోరీస్ ఏమి లేవు. కానీ ప్రతి ఒక్కరి లైఫ్ లో స్కూల్ డేస్ లో కానీ, కాలేజీ డేస్ లో కానీ లవ్ ఉండి అది కంటిన్యూ కాకపోవచ్చు. కానీ సినిమాలో అక్కడ కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కన్నీళ్లు వస్తాయి. అందులో ఆ ప్యూరిటీ ఉంది. అది చూసి బాగా ఎగ్జైట్ అయ్యాను.

సినిమా ఎవరికైనా చూపించారా?
– 96మూవీని విడుదలకు ముందే హీరో నానికి అలాగే బన్నీకి, వంశి పైడిప‌ల్లికి చూపించాను. నాని సూపర్ అన్నారు బన్నీ క్లాసిక్ అన్నారు. విడుదల తరువాత చెన్నైలో సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులతో పాటు, మల్టీ ప్లెక్స్ థియేటర్ లో కూడా నేను చూశాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు 96 బాగా నచ్చింది.

జానులో ఏమైనా మార్పులు చేశారా?
– ఆ కథలోని అసలు ఫ్లేవర్ మార్చలేదు. కాకపోతే ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం. వైజాగ్, హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో క‌థ న‌డుస్తుంది.

సమంత, శర్వాలను ఎలా ఒప్పించారు?
– సమంత మొదట్లో ఒప్పుకోలేదు, త్రిషా బాగా చేశారు, కంపారిజన్స్ వస్తాయి అని భయపడింది. నేనే పట్టుబట్టి ఒప్పించాను. ఆ త‌ర్వాత షూటింగ్ జ‌రుగుతున్న ప్ర‌తి రోజు ఈ రోజు ఏదో కొత్త మ్యాజిక్ క్రియేట్ అయింది స‌ర్ అని మెసేజ్ పెట్టేది. అంత‌లా సినిమాతో క‌నెక్ట్ అయింది. అలాగే శర్వా కి ఫోన్ చేసి సినిమా లోడ్ చేపిస్తున్న నువ్వు చూసి ఫోన్ చెయ్ అని చెప్పాను. చూసి ఫోన్ చేశాడు చాలా బాగుంది అనగానే వెంటనే నువ్వు ఈ సినిమా చేస్తున్నావ్ అన్నాను. రీమేక్ సినిమా కదా అన్నాడు నీకు సినిమా మీద ఏదయినా అనుమానం ఉందా? లేక పొతే చెయ్యి అన్నాను. నా మీద ఉన్న గౌరవంతో కావొచ్చు, లేదా నేను సినిమా చూసే విధానంతో కావొచ్చు ఒక్కరోజులోనే ఓకే అన్నాడు.సమంత, శర్వా నటనతో దర్శకుడు ప్రేమ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ గురించి?
– సాధార‌ణంగా ఓ డైరెక్ట‌ర్ ఓ సినిమాను చేసిన త‌ర్వాత అదే సినిమాను మ‌రోసారి చేస్తున్న‌ప్పుడు అక్క‌డేం చేశాడు..ఇక్క‌డేం చేస్తున్నాడ‌ని చూస్తాం. ప్రేమ్ ఆ విష‌యంలో ఎలాంటి డిస‌ప్పాయింట్ కాలేదు. విజ‌య్ సేతుప‌తి ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్ఫామ‌ర్‌. శ‌ర్వానంద్ చాలా హ్యాపీ. స‌మంత ఎలాగూ చేస్తుందని…శ‌ర్వా విష‌యంలో ప్రేమ్ కాస్త టెన్ష‌న్ ప‌డేవారు. విజ‌య్ సేతుప‌తి మ్యాచ్ చేయ‌డం అంత సుల‌భం కాదు.. అయితే శ‌ర్వా క‌థ‌ను ఓన్ చేసుకుని అద్భుతంగా బాలెన్స్ చేశాడు. సినిమా చూసిన త‌ర్వాత త‌ను నాపై న‌మ్మ‌కంతో ఒక‌రోజు మాత్ర‌మే టైమ్ తీసుకుని సినిమాకు ఓకే చెప్పేశాడు.

బేసిక్ గా మీకు రీమేక్స్ అంటే ఇష్టం ఉండ‌దు క‌దా!
– పదిహేను ఏళ్ళు అదే పని చేశాను. రీమేక్ చేయలేదనుకోండి నాకు హిందీలో ఎంట్రీ దొరికేది కాదు. అలాగే నా డ్రీమ్ పవన్ కల్యాణ్ గారితో సినిమా చేసే అవకాశం దొరికేది కాదు. సినిమా పరిశ్రమలో ఉన్న మా ప్రధాన ధ్యేయం ఓ మంచి సినిమా అందించడం. అది ఏ భాషలో వచ్చినా తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాను.

ఈ సంక్రాంతికి మీరే విన్నర్ అంటున్నారు?
– 2020 సంక్రాంతికి తెలుగు ఇండ‌స్ర్టీ విన్న‌ర్‌. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20 సంవ‌త్స‌రాలైంది. సంక్రాంతికి రెండు పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే ఎదో ఒకటి మాత్రమే బిగ్గెస్ట్ హిట్ గా ఉంటుంది. ఈ సారి మహేష్, బన్ని ఇద్ద‌రూ సెన్సేష‌న‌ల్ ఫిగ‌ర్స్‌తో వారి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించారు. మాకే మైండ్ బ్లాక్ అయింది. సంక్రాంతికి సరైన సినిమాలు వస్తే మనకి ఇంత పొటెన్షియాలిటీ, రెవెన్యూ ఉంటుందా అనిపించింది. మంచి సినిమా వస్తే ఏ రేంజ్ వసూళ్లు సాధించవచ్చో ఈ రెండు చిత్రాలు నిరూపించాయి. ఇద్దరి హీరోలకి వారి కెరీర్‌లో ఆల్ టైమ్ బెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే 2020 సంక్రాంతి నాకు పెద్ద‌టైమ్. మళ్ళీ లైఫ్ లో ఇలాంటి అవ‌కాశం వస్తుందో లేదో తెలీదు.

జానూ టైటిల్ ప్రభాస్ సినిమాకి అనుకున్నారట కదా.?
– ఈ చిత్రానికి ఓ మంచి సోల్ ఫుల్ టైటిల్ పెట్టాలని అనుకున్నాను. అందుకే జాను పెట్టాలని నిర్ణయించుకున్నాము. అప్పటికే ప్రభాస్ మూవీకి ఇది వర్కింగ్ టైటిల్ గా ఉందని తెలిసి నిర్మాత వంశీకి ఫోన్ చేసి చెప్తే తను, మా సినిమా విడుదలకు చాలా టైం ఉంది నో ప్రాబ్లం అని ప్ర‌భాస్, వంశీ,ప్ర‌మోద్ చెప్పిన త‌ర్వాత ఆ టైటిల్ ఫైన‌ల్ చేశాం.

పవన్ కల్యాణ్ తో సినిమా తీయాలని ఎప్పుడనుకున్నారు?

– 22సంవత్సరాల క్రితం నేను ‘తొలిప్రేమ’ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ అయినప్పటి నుండి నేను ప్రొడ్యూసర్ అయితే కల్యాణ్ గారితో సినిమా చేయాలి అని నా మైండ్ లో పడిపోయింది. అలా ఇన్నిరోజుల తర్వాత ‘పింక్’ రీమేక్ తో అది తీరింది. సినిమా షెడ్యూల్ కొనసాగుతుంది. మే11 ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయింది కాబట్టి ఈ సమ్మర్ లో రావాలనుకుంటున్నాం. మే15 టార్గెట్ పెట్టుకున్నాం. అలాగే ఈ ఉగాదికి ‘వి’ సినిమా రిలీజ్ చేస్తున్నాం.

మహేష్ బాబుతో నెక్స్ట్ సినిమా ఎప్పుడు?
– వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఒక సారి స్క్రిప్ట్ రెడీ అవ్వగానే షూటింగ్ స్టార్ట్ చేస్తాం.

ఇన్ని ప్రాజెక్ట్స్ ని ఒకే సారి ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు?
– మనం స్కూల్ లో చదువుతున్నప్పుడు ఆరు సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎలాగైతే ఒక్కో సబ్జెక్ట్ కి కొంత సమయం కేటాయిస్తామో నేను అంతే.. ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ రెండు ఒకేసారి చూసుకోవడానికి శిరీష్, హర్షిత్ వారి టీమ్ మెంబర్స్ ఉన్నారు. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here