మొన్న భరత్ అనే నేను, నిన్న మహర్షి, నేడు సరిలేరు నీకెవ్వరు, ఇలా వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నారు. ఇక తన సినిమా కెరీర్ మొత్తంలో సరిలేరు సినిమాని ఎంచుకోవడం తాను తీసుకున్న మంచి నిర్ణయం అని, ఇటీవల ఆ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా మహేష్ బాబు చెప్పారు.
ఇక ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్, నేడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తమ ఫ్యామిలీతో కలిసి దిగిన గ్రూప్ ఫోటోని పోస్ట్ చేసారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో కలిసి దిగిన ఫోటోని మహేష్ పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ ఫోటోని సూపర్ స్టార్ ఫ్యాన్స్ విపరీతంగా షేర్స్, లైక్స్ చేస్తూ దానిని మరింతగా వైరల్ చేస్తున్నారు…..!!