దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్ర రాజం ‘ఆర్ఆర్ఆర్’. అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కొమరం భీం, అల్లూరి సీతారామరాజులుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్లు గా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూట్ లో ఇటీవల బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా జాయిన్ అయ్యారు.
ఇకపోతే నేడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూట్ సెట్స్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ లతో కలిసి దర్శకుడు రాజమౌళి దిగిన ఒక ఫోటోలను పోస్ట్ చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్. ‘ఈ ముగ్గురు దిగ్గజ నటులతో మా సినిమా సెట్స్ వెలిగిపోతున్నాయి’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.