`కమిట్‌మెంట్‌` త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఫుల్ గా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది – ద‌ర్శ‌కుడు ల‌క్ష్మీకాంత్ చెన్న.

0
764

ల‌క్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంలో ఫూట్ లూస్ ఎంటర్టైన్మెంట్, ఎఫ్ త్రీ ప్రొడక్షన్స్ ప‌తాకాల‌పై బ‌ల్దేవ్‌ సింగ్‌, నీలిమ‌. టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `కమిట్‌మెంట్‌`. తేజస్విని మడివాడ, అమిత్ తివారి, అన్వేషి జైన్, తనిష్క్‌ రాజన్, అభి, సూర్య శ్రీనివాస్,రమ్య పసుపులేటి, సిమర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. నాలుగు క‌థ‌ల‌తో న‌డిచే అంతాల‌జీ ఈ సినిమా. స‌మాజంలో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించ‌డం జ‌రిగింది. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో…

నిర్మాత బ‌ల్దేవ్‌ సింగ్ మాట్లాడుతూ – “ఈ చిత్రం పోస్టర్ ని చూసి ఒక అంచనాకి రావొద్దు. ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
నిర్మాత అనిల్ మాట్లాడుతూ – “2013లో నేను లక్ష్మికాంత్ ని మొదటి సారి కలిశాను. ఆయన కమిట్ మెంట్ నచ్చి ఈ సినిమా అవకాశం ఇవ్వడం జరిగింది” అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ద్వారకేష్ మాట్లాడుతూ – “మా నిర్మాతలకి మొదటి సినిమా అయిన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాతో లక్ష్మీకాంత్ తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతాడు”అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ సురేష్ పోలాకి మాట్లాడుతూ – “నేను ఒక బ్యాంక్ ఉద్యోగిని. ఒక రూపాయితో ఇంకో రూపాయి ఎలా సంపాదించాలని ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిని అయ్యాను. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను ‘అన్నారు.

దర్శకుడు లక్ష్మి కాంత్ మాట్లాడుతూ – ” ద్వారకేష్, సురేష్ గార్ల ద్వారానే నాకు ఈ అవకాశం వచ్చింది. నేను గతంలో ‘పరిచయం’ అనే సినిమా తీయడం జరిగింది. దానికి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకి కావాల్సిన అన్ని అంశాలతో ఈ సినిమా తెరకెక్కించాను. ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ తో పాటు మంచి సందేశం కూడా ఉంది. నాలుగు విభిన్నమైన కథలు ఈ సినిమాలో కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. అందరూ పూర్తిగా ఎంటర్టైన్ అయ్యే సబ్జెక్ట్. మీరు డబ్బులు పెట్టి టికెట్ కొన్నందుకు తప్పకుండా న్యాయం చేస్తుంది’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరోలు అమిత్ తివారి, తనిష్క్‌ రాజన్, సూర్య శ్రీనివాస్, శ్రీనాద్.. హీరోయిన్స్ అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, సిమర్ పాల్గొని ప్ర‌సంగించారు.

తేజస్విని మడివాడ, అమిత్ తివారి, అన్వేషి జైన్, తనిష్క్‌ రాజన్, అభి, సూర్య శ్రీనివాస్, రమ్య పసుపులేటి, సిమర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి..
ద‌ర్శ‌క‌త్వం: ల‌క్ష్మీకాంత్ చెన్న,
నిర్మాత‌లు: బ‌ల్దేవ్‌ సింగ్‌, నీలిమ‌. టి,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్: ద్వారకేష్,
లైన్ ప్రొడ్యూసర్: సురేష్ పోలాకి,
సినిమాటోగ్రఫీ: సజీష్‌ రాజేంద్రన్, నరేష్ రానా,
మ్యూజిక్: నరేష్ కుమరన్‌,
ఆర్ట్‌: సుప్రియ బట్టే పట్టి ,
ఎడిటర్: ప్రవీణ్ పూడి,
కాన్సెప్ట్: ఈశ్వర్ రెడ్డి ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here