నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను, మీ ప్రేమకు కృతజ్ఞతలు : హాస్యనటుడు సునీల్….!!

0
942

హాస్య నటుడు సునీల్ తొలుత ‘నువ్వే కావాలి’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఆ తరువాత ‘నువ్వు నేను’, ‘నువ్వే నువ్వే’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మధుడు‘, ‘మల్లీశ్వరి’ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. ఆ తరువాత హీరోగా మారి పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు. ఇక అతి త్వరలో తెరకెక్కబోయే ‘కలర్ ఫోటో’ అనే సినిమాలో ఆయన విలన్ పాత్రలో నటించినున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే నేడు హాస్య నటుడు సునీల్ కు సైనస్ ఇన్ఫెక్షన్ కారణంగా డాక్టర్ ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడం జరిగింది. తనకు పెద్దగా అనారోగ్యం ఏమి లేదని, ప్రస్తుతం మీ అందరి ప్రేమవలన ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని, రేపు రిలీజ్ కాబోయే ‘డిస్కో రాజా’ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయండని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సునీల్ ఒక పోస్ట్ చేస్తూ తెలిపారు. దీనితో అయన అనారోగ్యం పై వస్తున్న పుకార్లకు తెరపడింది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here