ర‌వితేజ‌గారి కెరీర్‌లో `డిస్కోరాజా` వ‌న్నాఫ్ ది బెస్ట్ మూవీస్‌గా నిలుస్తుంది- దర్శకుడు వీఐ ఆనంద్‌

0
682
వీఐ ఆనంద్‌

మాస్ మహారాజ్ రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం డిస్కో రాజా. ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్నీ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈనెల 24న విడుదల కానుంది. ఈ సంధర్భంగా దర్శకుడు వి.ఐ ఆనంద్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

సైన్స్ ఫిక్షన్ జోనర్ లోనే సినిమా ఎందుకు చేయాలనిపిచింది ?
– సైన్స్ ఫిక్ష‌న్ నా ఫెవ‌రెట్ జాన‌ర్‌. ఫ్యాంట‌సీ అంటే నాకు ఇష్టం. ప‌దేళ్ల క్రిత‌మే ఈ సినిమా మెయిన్ పాయింట్ ఆలోచ‌న నాకు ఉంది. ఈ పాయింట్‌పై వ‌ర్క్ చేస్తున్నాను. అయితే ఆడియ‌న్స్‌కు క‌న్విన్సింగ్‌గా చెప్ప‌డానికి నాకు స‌రైన మెటిరీయ‌ల్ దొర‌కడం లేదు. ఇటీవ‌ల ఏడాదిన్నర క్రితం బ‌యో రీసెర్చ్‌కి చెందిన ఓ ఆర్టిక‌ల్ చ‌దివాను. దాన్ని ఆధారంగా అలాంటి ప‌రిశోధ‌న ఒక‌టి స‌క్సెస్ అయితే వెండితెర‌పై ఆడియ‌న్స్‌కు క‌న్విన్సింగ్‌గా ఎలా ఉంటుంది అనే అంశం ఆధారంగా `డిస్కోరాజా` తీశాను. సినిమా బ‌ట‌ర్‌ఫ్లై టైటిల్ లొగొకు సినిమాలో జ‌స్టిఫికేష‌న్ ఉంది. ప్రీప్రొడ‌క్ష‌న్‌కు ఎక్కువ టైమ్ తీసుకున్నాం.

డిస్కోరాజా గురించి?
– డిస్కోరాజా ఒక సైన్స్‌ఫిక్ష‌న్ డ్రామా. సినిమాలో ఏదీ కావాల‌ని పెట్ట‌లేదు. కామెడీ, యాక్ష‌న్ , ఎమోష‌న్స్ ఇలా అన్ని అంశాలు స్టోరీలో కుదిరాయి. ర‌వితేజ‌గారి నుంచి ఆయ‌న అభి మానులు, ప్రేక్ష‌కులు ఆశించే అన్ని అంశాలు సినిమాలో ఉంటాయి. మాస్ ఎలిమెంట్స్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌.

ఈ సినిమా మీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్. ఈ సినిమా కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
– నా కెరీర్ ప‌రంగా డిస్కోరాజా నా కెరీర్‌లో చాలా ముఖ్య‌మైన సినిమా. పెద్ద బ‌డ్జెట్ సినిమా కూడా. నా కెరీర్ ముందుకు వెళ్ల‌డానికి కూడా ఈ సినిమా స‌క్సెస్ ముఖ్య‌మ‌ని న‌మ్ము తున్నాను. ఐస్‌ల్యాండ్ షెడ్యూల్ చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. కొన్నిసార్లు వాతావ‌ర‌ణం అనుకూలించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ రిస్క్ చేశాం. క‌ష్ట‌ప‌డి తీశాం. ఈ సీన్స్ స్పిల్టై సినిమాలో కీల‌కంగా ఉంటాయి. క‌థ ప్ర‌కారం కూడా చాలా ముఖ్య‌మైన సీక్వెన్స్ ఇది. సినిమా చూసిన‌ప్పుడు ఈ విష‌యం ప్రేక్ష‌కుల‌కు అర్థం అవుతుంది. కిస్టోఫ‌ర్ నోలాన్ ఈ లొకేష‌న్‌లో నే సినిమా తీశారు. సేమ్ లొకేష‌న్‌లో షూట్ చేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది.

‘డిస్కో రాజా’ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉండ‌బోతున్నాయా?
– ఇది డిఫ‌రెంట్ కాన్పెప్ట్ మూవీ. లైవ్ పోర్ష‌న్‌, రెట్రో సీక్వెన్స్‌, సెన్స్ ఫిక్ష‌న్ ఇలా మూడు ర‌కాల సీక్వెన్స్‌ ఉన్నాయి. డిస్కోరాజా క్యారెక్ట‌ర్ ఒక్క ర‌వితేజ‌గారికే సెట్ అవుతుంది. ఈ సినిమాలో మ్యూజిక్ ల‌వ్వింగ్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా చేశారు ర‌వితేజ‌. మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఫ్యాన్‌. అమితాబ్ బ‌చ్చ‌న్ ఫ్యాన్‌. చాలా ఆస‌క్తికరంగా ఉంటుంది. సినిమాలో ఆయ‌న క్యారెక్ట‌ర్‌, యాటీట్యూడ్ హైలైట్‌గా ఉంటాయి. డిస్కోరాజా క్యారెక్ట‌ర్ ఒక్క ర‌వితేజ‌గారికే స‌రిపోతుంది.

ర‌వితేజ‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్?
-ర‌వితేజ‌గారితో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ బాగుంది. ఆయ‌న క్యారెక్ట‌ర్‌లో బాగా ఇన్‌వాల్వ్ అయ్యారు. ఆడియ‌న్స్ ఆయ‌న క్యారెక్ట‌ర్‌కు క‌నెక్ట్ అవుతారు. ర‌వితేజ‌గారు ఓ డిఫ‌రెంట్ మూవీ చేయాల‌నుకున్న‌ప్పుడు నేను ఈ క‌థ చెప్పాను. ఆయ‌న కు ఈ క్యారెక్ట‌ర్ బాగా న‌చ్చింది. చిన్న‌ప్ప‌టి నుంచి త‌నకు డిస్కో మ్యూజిక్‌ అంటే చాలా ఇష్ట‌మ‌ని ర‌వితేజ‌గారు ఓ సంద‌ర్భంలో చెప్పారు. ఈ సినిమా ఆయ‌న కెరీర్‌లోని టాప్ ఫైవ్‌ బెస్ట్ మూవీస్‌లో ఒక‌టిగా నిలుస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.

ఇత‌ర న‌టీన‌టుల గురించి?
– ఈ సినిమాలో న‌భాన‌టేష్‌, తాన్యాహోప్‌, పాయ‌ల్‌రాజ్‌పుత్ న‌టించారు. ఢిల్లీకి చెందిన బ్యాంకు ఉద్యోగిగా క‌నిపిస్తారు న‌భాన‌టేష్‌, సైంటిస్ట్ పాత్ర‌లో న‌టించారు తాన్యా. ఇక రెట్రో ఎపిసోడ్స్‌లో పాయ‌ల్‌రాజ్‌పుత్ వ‌స్తారు. చెన్నైకి చెందిన బ‌ర్మాసేతు అనే గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో న‌టించారు బాబీసింహా. నిర్మాత రామ్ తాళ్లూరి బాగా స‌హ‌క‌రించారు. ఆయన కెరీర్‌లో వ‌న్నాఫ్ ది బెస్ట్ పెర్పార్మెన్స్ అవుతుంది. సీనియ‌ర్ న‌రేష్‌గారు ఓ కీల‌క పాత్ర చేశారు. సునీల్‌గారు, వెన్నెల కిశోర్‌, స‌త్య కామెడీ పార్టులో వ‌స్తారు. క‌థ‌
ప్ర‌కార‌మే వ‌స్తారు.

ఈ కాన్సెప్ట్ సినిమాలో కామిడీ, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంత వ‌ర‌కు ఉంటాయి?
– కాన్సెప్ట్ మూవీస్‌లో కూడ క‌మ‌ర్షియాలిటీ ఉండొచ్చు. `డిస్కోరాజా` చిత్రం అలాంటిదే. గ‌తంలో నేను తీసిన ఒక్క‌క్ష‌ణం చిత్రానికి మంచి రివ్యూస్ వ‌చ్చాయి. నాకు మంచి పేరు వ‌చ్చింది. కానీ ఆశించిన స్థాయిలో క‌లెక్ష‌న్స్ లేవు. స‌రైన స‌మ‌యంలో విడుద‌ల కాలేద‌నిపించింది. నేను సైంటిఫిక్ వేలో దేవుణ్ని న‌మ్ముతాను. గీతా ఆర్ట్స్‌లో నాకు క‌మిట్‌మెంట్ ఉంది. రెండు, మూడు కథలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్‌లో నా తర్వాతి సినిమా ఉండొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here