సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు‘ సూపర్ సక్సెస్ సాధించి, ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ ని, అలానే రూ.124 కోట్లకు పైగా షేర్ ని ప్రపంచవ్యాప్తంగా కొల్లగొట్టడం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే క్యారెక్టర్ లో నటించగా, ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
ఇకపోతే సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి రెండు రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెకేషన్ కు వెళ్లిన సూపర్ స్టార్ మహేష్, కాసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో తనయుడు గౌతమ్, తనయ సితార లతో కలిసి న్యూయార్క్ సిటీలో సరదాగా దిగిన ఫోటోని పోస్ట్ చేసారు. ఇక ఈ ఫొటోలో బ్లాక్ కలర్ జర్కిన్ వేసుకుని మరింత యంగ్ గా కనపడుతున్న సూపర్ స్టార్ ని చూసి తెగ మురిసిపోతున్న ఫ్యాన్స్, దానిని ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో లైక్స్, షేర్స్ తో తెగ వైరల్ చేస్తున్నారు….!!