‘డిస్కోరాజా’ చిత్రాన్ని ఆడియ‌న్స్ త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు – ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మాస్ మహారాజ్ రవితేజ

0
187
‘డిస్కోరాజా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డిస్కోరాజా’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం సమకూర్చారు. ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో  డిస్కోరాజా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

ఈ సందర్భంగా మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన పాత్రలను ఆనంద్‌ నాకు చెప్పారు. అందుకే వెంటనే సినిమాకు ఓకే చెప్పాను. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరీ చేశా. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నేను ఎంతో ఎంజాయ్‌ చేశాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు అంతకంటే ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సీక్వెల్‌ కూడా ఉంటుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌తో ఇది నాకు పదకొండో సినిమా. పాటలు ఎంత హిట్టయ్యాయో మీకు తెలిసిందే. సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని సినిమాకు నిజమైన ఆస్తి. చాలా బాగా పని చేశాడు. ఈ సినిమాలో సైఫై సెట్‌ అద్భుతం. ఆ సెట్‌ను అందరూ బాగా వినియోగించుకున్నారు. ప్రొడ్యూసర్‌ రామ్‌ తల్లూరితో ఇది రెండో సినిమా. మొదటి సినిమా అనుకున్న ఫలితం తేలేకపోయినా ఈ సినిమా మాత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. రచయిత అబ్బూరి రవి నా సినిమాలకు నన్ను దృష్టిలో పెట్టుకొని కథ రాస్తారు. ఇక పాటల విషయంలో శాస్త్రి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ద్వారా బాబీ సింహా, రాంకీలతో తొలిసారి కలిసి పనిచేశాను. ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. సునీల్‌తో చాలా గ్యాప్ తరవాత కలిసి పనిచేశాను. ఈ సినిమాలో నటించిన అందరితో మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సాధారణంగా నేను ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లతో నటించాను కాని.. తొలిసారి ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో నటించాను పాయల్ రాజ్‌పుత్‌ది ప్రత్యేక పాత్ర .. నభా నటేష్ గురించి చెప్పాల్సిన అవసరంలేదు ఇరగదీసింది ఇక ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర వర్క్ చాలా బాగుందని చెప్పారు. రెట్రో, సైఫై సెట్‌లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి’’ అన్నారు.

దర్శకుడు వీఐ ఆనంద్‌ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో ఇది ఒక మైలురాయి. టైగర్‌ సినిమాకు దర్శకత్వం వహించిన సమయంలో రవితేజగారు నాకు ఫోన్‌ చేసి ప్రత్యేకంగా నన్ను అభినందించారు. నాలాంటి కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం నిజంగా రవితేజ గొప్పతనం. ప్రతి ఒక్క దర్శకుడు కనీసం ఒక్క సినిమానైనా చేయాల్సిన హీరో రవితేజ’’ అని ఆయన అన్నారు. గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ ‘‘డిస్కోరాజా’ అనే టైటిల్‌తోనే సినిమా డైరెక్టర్‌ సగం విజయం సాధించారు. రవితేజలాంటి మాస్‌ హీరో డైరెక్టర్‌కు దొరికితే ఆ సినిమా మామూలుగా ఉండదు. ఇక తమన్‌లాంటి మ్యూజిక్‌ డైరెక్టర్‌తో రవితేజ కలిస్తే ఆ కాంబినేషన్‌ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు’’ అని అన్నారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ రవితేజ ‘దరువు’కు రైటర్‌గా పని చేశాను. నేను రాజది గ్రేట్ సినిమా తీసాను రవితేజ గారితో మళ్ళీ ఎప్పుడెప్పుడు వర్క్ చెయ్యాలని ఎదురు చూస్తున్నాను. సినిమా ట్రైలర్ సూపర్బ్ గా ఉంది. నిర్మాత రామ్ తాళ్లూరి గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, పాయల్, సభ గారికి బెస్ట్ విశేష్. మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. రవితేజ స్టైల్‌, ఎనర్జీ నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌. ‘రమణా మాస్‌ మహారాజ్‌ సినిమా వస్తుందిరా..లోడెత్తాలా..’’ అని ‘సరిలేరు నీకెవ్వరూ’ డైలాగ్‌ చెప్పి అలరించారు.

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌ వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘‘మా బావ రవితేజ మాస్ మహారాజా. ఆయన ఎనర్జీతో ఎవరూ మ్యాచ్ అవ్వలేరు. ఈ సినిమా టీజర్‌లో గన్ పట్టుకుని భలే చేశాడు డైరెక్టర్ ఆనంద్ తన తొలి సినిమా నుంచి నాకు తెలుసు. నా మనసుకు బాగా దగ్గరైన వ్యక్తి. చాలా మంచి డైరెక్టర్. ఈ సినిమాకు టైటిల్ ‘డిస్కోరాజా’ అని చాలా బాగా పెట్టాడు. అది రవితేజకు కరెక్ట్‌గా సరిపోతుంది. నిర్మాత రామ్ తాళ్లూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా ప్యాషన్‌గా తీశారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక మా బావ రవితేజ, మాస్ మహారాజా.. తన ఎనర్జీతో ఎవరూ మ్యాచ్ అవ్వలేరు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని అందుకుని టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలి అన్నారు.

డైరెక్టర్ గోపిచంద్ మలినేని మాట్లాడుతూ….రవితేజకి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు తమన్. ఆనంద్ ఈ సినిమాకు డిస్కోరాజా అనే టైటిల్ పెట్టినప్పుడే సక్సెస్ అయ్యారు. విజువల్స్ అన్ని బాగున్నాయి, టీజర్స్, ట్రైలర్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. సునీల్ , వెన్నెల కిషోర్, బాబీ సింహ ఇలా అందరికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

న‌టుడు సునీల్ మాట్లాడుతూ – “చాలా కాలం తరువాత మంచి సినిమాలో నటించాను. రవితేజ గారికి థాంక్స్, కొత్తగా మరియు గొప్పగా ఉండబోతుంది డిస్కోరాజా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతకు ధన్యవాదాలు అన్నారు.

డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ – ” ఇండస్ర్టీ కి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ చంటిగాడు పరిమనెంట్. ఆ చైర్ అక్కడే ఉంటుంది. ఆయన స్థానం అక్కడే ఉంటుంది. ఒక రైటర్ గా ఉన్న నన్ను నమ్మి ‘పవర్’ సినిమా అవకాశం ఇచ్చిన రవితేజ గారికి ధన్యవాదాలు. నా లాంటి ఎంతో మంది దర్శకులకి లైఫ్ ఇచ్చారు. ఆయనెప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. రవితేజ గారి కెరీర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు వేరు ‘డిస్కో రాజా’ వేరు. రామ్ తాళ్లూరి గారు మా ఫ్యామిలీ కి మంచి సన్నిహితులు ఈ సినిమాతో ఆయనకు సాలిడ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను” అన్నారు

హీరోయిన్ నభా నటేశ్ మాట్లాడుతూ – “ర‌వితేజగారి ‘విక్రమార్కుడు’ నా ఫెవరెట్‌ మూవీ. `కిక్‌` సినిమా కూడా ఇష్టమే. ఆయనకు నేను బిగ్‌ ఫ్యాన్‌ని. రవితేజగారి ఎనర్జీ, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్ర‌జెన్స్‌ చాలా బాగుంటాయి. రవితేజగారితో వర్క్‌ చేయడాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను. షూటింగ్‌ చాలా ఫన్నీగాగడిచిపోయింది. మాస్‌ స్కైఫై థ్రిల్లర్‌కురవితేజగారి ఎనర్జీ, వీఐ ఆనంద్‌గారి స్టైల్‌ తోడైతే ఎలా ఉంటుందో డిస్కోరాజా అలా ఉంటుంది.ఆడియన్స్‌కు తప్పక నచ్చుతుంది“ అన్నారు.

హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్ మాట్లాడుతూ – “ఇలాంటి పాత్ర ఇప్పటి వరకూ ఎప్పుడూ చేయలేదు. ఈ సినిమా కథ విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఆనంద్‌గారి సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తిఉంటుంది. ఈ సినిమాలో ప్రేక్షకులు థ్రిల్‌ అయ్యే అంశాలు ఉన్నాయి“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here