విష్ణు మంచు , సునీల్ శెట్టి మ‌ధ్య హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ఆధ్వ‌ర్యంలో `మోస‌గాళ్ళు` భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌

0
684

విష్ణు మంచు క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం మోస‌గాళ్ళు. జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. విష్ణు మంచు, సునీల్ శెట్టి మ‌ధ్య భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను ఇప్పుడు చిత్రీక‌రిస్తున్నారు. హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ఆధ్వ‌ర్యంలో.. హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో ఈ యాక్ష‌న్ సీన్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా నిపుణుల‌ పర్యవేక్ష‌ణ‌లో ఈ యాక్ష‌న్ పార్ట్‌ను మాస్ట‌ర్ పీస్‌లా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు తెర‌పై రాన‌టువంటి విధంగా విష్ణు మంచు మోస‌గాళ్ళు లో ఈ యాక్ష‌న్ సీన్ ఉండ‌బోతుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఈ స‌న్నివేశం కోసం ఇద్ద‌రు స్టార్స్ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను కూడా తీసుకుంటున్నారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:
విష్ణు మంచు , సునీల్ శెట్టి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌, రూహి సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
నిర్మాత‌: విష్ణు మంచు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ కుమార్‌.ఆర్‌
ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌
సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కిర‌ణ్ కుమార్‌.ఎం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here