ఆద్య, సితార షోలో సూపర్ స్టార్ సందడి

0
442

సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు తొలి రోజు నుండి మంచి టాక్ తో, అద్భుతమైన కలెక్షన్స్ తో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.  వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల పైచిలుకు షేర్ ని ఈ సినిమా అందుకోవడం జరిగిందని సినిమా యూనిట్ హన్మకొండలో జరిగిన సక్సెస్ మీట్ లో ప్రకటించడం జరిగింది. ఇక సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సూపర్ స్టార్ మహేష్, నేడు యూట్యూబ్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న ఆద్య, సితార ఛానల్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసి, కాసేపు వారితో సరిలేరు సక్సెస్ గురించి కబుర్లు చెప్పారు.

తన సినిమా కెరీర్ లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం సరిలేరు నీకెవ్వరు ఎంచుకోవడం అని, అలానే సినిమా సక్సెస్ కు ముఖ్యకారకులు దర్శకులు అనిల్ రావిపూడి అని మహేష్ అన్నారు. కెరీర్ లో తొలిసారి ఒక మిలిటరీ సోల్జర్ పాత్రలో నటించడం ఎప్పటికీ మరిచిపోలేనని, ఈ రోల్ ని ఎంతో గొప్పగా రాసిన దర్శకులు అనిల్ కి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు మహేష్. అలానే సినిమాకు సంబందించిన పలు విషయాలను ఆద్య, సితారలతో మహేష్ పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here