‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్…..!!

0
869

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో శ్రీ దేవి మూవీస్, ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై తెరకెక్కుతున్న తాజా సినిమా ‘ఎంత మంచివాడవురా’. కుటుంబ కథా చిత్రాలను ఎంతో హృద్యంగా తెరకెక్కించే సతీష్ , ఈ సినిమాను కూడా ఒక మంచి పాయింట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, శ్రోతల నుండి విశేషమైన స్పందనను అందుకోవడం జరిగింది. ఇకపోతే ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ని కాసేపటి క్రితం సినిమా యూనిట్ విడుదల చేసింది.

ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో జరుగనున్న ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వారు తమ ప్రకటనలో తెలిపారు. దానితో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. గోపి సుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు రాజ్ తోట ఫోటోగ్రఫిని అందిస్తుస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here