బాక్సర్ లుక్ లో అదరగొట్టిన వరుణ్ తేజ్….!!

0
192
బాక్సర్ లుక్ లో అదరగొట్టిన వరుణ్ తేజ్.

ఇటీవల గద్దలకొండ గణేష్ అనే మాస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రొఫెషనల్ బాక్సర్ల దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్, సిద్దు ముద్ద నిర్మాతలుగా రూపొందుతున్న ఈ సినిమా నుండి బాక్సింగ్ గ్లౌస్ పట్టుకుని ఒక పిక్ ని వరుణ్, నేడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసారు. మంచి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా, జార్జి విలియమ్స్ ఫోటోగ్రఫిని, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసే అవకాశం కనపడుతోంది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here