సెన్సార్ పూర్తి చేసుకున్న అల.. వైకుంఠపురంలో

0
287
Ala Vaikuntapurramuloo Censor complted

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 సంక్రాతి కానుకగా చిత్రం విడుదల అవుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కాగా అల వైకుంఠపురంలో చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తయ్యాయి. ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించింది. చిత్రం విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో

నిర్మాతలు మాట్లాడుతూ….అల వైకుంఠపురంలో చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తయ్యాయి.. ‘అల వైకుంఠపురంలో’ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. పాటలు ఇంతటి ప్రాచుర్యం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని, 2020 జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ”అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్ ను ” వైభవంగా, వినూత్నంగా జరుపుతున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here