వైరల్ అవుతోన్న సూపర్ స్టార్ మహేష్ 50 అడుగుల కటౌట్…..!!

0
326

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ మహేష్ ఫ్యాన్స్, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడంతో పాటు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేయడం జరిగింది. రిలీజ్ కు కేవలం మరొక పదిరోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సరిలేరు యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఫుల్ స్వింగ్ లో ముందుకు తీసుకెళ్తోంది. ఇకపోతే నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సూపర్ స్టార్ మహేష్ 50 అడుగుల కటౌట్ ని ఆయన ఫ్యాన్స్  ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక భీమవరంలో సూపర్ స్టార్ మహేష్ 50 అడుగుల కటౌట్ ప్రస్తుతం అక్కడి ప్రజలను ఎంతో ఆకర్షించడంతో పాటు దాని ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విరివిగా ప్రచారం అవుతున్నాయి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here