నైజాంలో రూ.10 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తున్న ‘ప్రతిరోజు పండగే’…..!!

0
7000
Pratiroju Pandage

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సూపర్ హిట్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ప్రతిరోజు పండగే. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ బ్యానర్లపై యువ నిర్మాత బన్నీ వాసు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలిరోజు తొలిఆట నుండి మంచి హిట్ టాక్ తో, సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో, ఎంటర్టైన్మెంట్ అంశాలు జోడించి తెరకెక్కిన ఈ సినిమాపై అన్ని ప్రాంతాల ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. ఇకపోతే నేటితో ప్రతిరోజు పండగే కలెక్షన్స్ నైజాం ఏరియాలో రూ.22 కోట్ల గ్రాస్, అలానే రూ.10.59 కోట్ల షేర్ అందుకుని, ఇంకా దిగ్విజయంగా దూసుకెళ్తోంది.

ఈ సినిమా అన్ని ప్రాంతాల లో దిగ్విజయంగా దూసుకెళ్తోంది. తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తేజ్ తాతయ్యగా సత్య రాజ్ ఒక ముఖ్య పాత్రలో నటించారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here