నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా నాని నిర్మాణంలో విశ్వ‌క్ సేన్ `హిట్‌` ఫ‌స్ట్ గ్లింప్స్‌.. ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల

1
660

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్‌` `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

విశ్వ‌క్ సేన్ `హిట్‌` `ది ఫ‌స్ట్ కేస్‌` చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు.

“ఒక‌సారి ఇలాంటి ఇన్సిడెంటే ఈ నీలైఫ్‌లో జ‌రిగిన‌ప్పుడు యు లాస్ట్ స‌మ్ వ‌న్ యు ల‌వ్డ్‌. ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి సిచ్యువేష‌నే వ‌చ్చింది. వాట్ యు వాంట్ టు డు అబౌట్ ఇట్‌“ అనే డైలాగ్‌తో ఓ సీరియ‌స్ ఇష్యూ వ‌ల్ల ఐపీయ‌స్ ఆఫీస‌ర్ ఎలాంటి స‌మ‌స్య‌లో ఉన్నాడా? అని గ్లింప్స్‌తో ఆస‌క్తి ఏర్ప‌డుతుంది. అలాగే పోలీస్ ఆఫీస‌ర్ అయిన విశ్వ‌క్‌సేన్ ఎవ‌రినో వెతుక్కుంటూ ఓ ఇంట్లోకి వెళ్లే స‌న్నివేశాన్ని ఈ గ్లింప్స్‌లో చూడొచ్చు. వివేక్ సాగ‌ర్ సంగీతం.. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. సినిమాను ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు:
విశ్వ‌క్‌సేన్‌, రుహానీ శ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శైలేష్ కొల‌ను
స‌మ‌ర్ప‌ణ‌: నాని
నిర్మాత‌: ప‌్ర‌శాంతి త్రిపిర్‌నేని
మ్యూజిక్‌: వివేక్‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్‌
ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌
ఎడిటర్‌: గ్యారీ బి.హెచ్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.వెంక‌ట‌ర‌త్నం(వెంక‌ట్‌)
స్టంట్స్‌: న‌భా
ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌: అనిల్ భాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here