‘ఊల్లాల ఊల్లాల’ చిత్రంలో నాది రిచ్ అండ్ విట్టి క్యారెక్టర్ – హీరోయిన్ అంకిత మహారాన.

0
1397

సుఖీభవ మూవీస్ పతాకంపై ఎ.గురురాజ్ నిర్మాతగా సీనియర్ నటుడు సత్యప్రకాష్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న  ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రం. కొత్త కథ, కథనాలతో ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సందర్భంగా హీరోయిన్ అంకిత పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

మీ నేపథ్యంగురించి ?
– ఒరియా కుటుంబానికి చెందిన అమ్మాయిని నేను, మా ఫాదర్ ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయ్ కావడం వలన దేశంలో అనేక చోట్లకు వెళ్లడం జరిగింది. ఐతే నేను బెల్గామ్ లో పుట్టాను, ఢిల్లీ, బెల్గామ్, బెంగుళూరులలో నేను చదువుకున్నాను. 2016 మిస్ బెంగుళూరు గా సెలెక్ట్ గెలిచాను.

కన్నడలో ఏమైనా సిన్మాలు చేశారా?
– లేదు… కన్నడ పరిశ్రమలో కన్నడ అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఐతే తెలుగులో నాకు ఇది రెండవ సినిమా.

మీ పాత్ర ఎలా ఉంటుంది ?
– నా పాత్ర గురించి ఎంత వరకు చెప్పాలో నాకు తెలియదు. నిజం చెప్పాలంటే ఇంకా మూవీ కథ మొత్తం కూడా తెలియదు. నా పాత్ర కొంచెం అనుమానాస్పదంగా, అబ్బాయిలను భయపెట్టేదిగా ఉంటుంది . రిచ్ అండ్ విట్టి క్యారెక్టర్ నాది.

స్క్రీన్ పై రొమాంటిక్ సీన్స్ చేయడం ఎలా అనిపిస్తుంది?
– చుట్టూ ముప్పై, నలభై మంది ఉన్నప్పుడు రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం అంత సులభం కాదు. నటి ఎదగాలనుకున్నప్పుడు మనం అన్ని విధాలుగా సిద్ధం కావాలి. ఒకప్పుడు మాధురి దీక్షిత్..ప్రస్తుతం కంగనా లాంటి వాళ్లు కూడా చేశారు.

దర్శకుడు సత్య ప్రకాష్ గురించి చెప్పండి ?
– దర్శకులు సత్య ప్రకాష్ గారు చాలా మంచి వారు,సెట్స్ లో ఆయన నాకు అనేక విషయాలు చక్కగా చెప్పేవారు. ఆయన కూడా ఒరియా ఫ్యామిలీ కి చెందినవారు. నా పట్ల చాలా కేరింగ్ గా ఉండేవారు.

తెలుగు పరిశ్రమ ఎలా ఉంది ?
– తెలుగు జాతీయ పరిశ్రమలా ఉంది. మిగతా పరిశ్రమలలో వలే, ఇక్కడ లాంగ్వేజ్ గురించి ఇబ్బంది ఉండదు. హీరోయిన్స్ కి మంచి గౌరవం ఇస్తారు. తెలుగు పరిశ్రమలో చాలా కాలం పని చేయాలి అనుకుంటున్నాను.

కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేశారా?
– రామ్ గోపాల్ వర్మ సర్ రెండు చిత్రాలకు ఆఫర్ ఇచ్చారు. ఆలాగే ఆయనకు శ్రీదేవి నటన ఎంత ఇష్టమో, నా నటన కూడా అంతే ఇష్టం అని చెప్పడం గొప్ప కాంప్లిమెంట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here