బుల్లితెరపైకి ధోని ఆర్మీ షో

0
825

ఇండియన్ కెప్టెన్ కూల్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని వారుండరు. ప్రపంచం గుర్తించేలా క్రికెట్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన మిస్టర్ పర్ఫెక్ట్ ఇండియన్ ఆర్మీపై ఎప్పటికప్పుడు తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు.ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా గౌరవాన్ని పొందిన మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు మన సైనికుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు.

సొంతంగా ఒక టివిషోని ప్రొడ్యూస్ చేసేందుకు ధోని సిద్దమయ్యాడు. భారతదేశ సాయుధ దళాల పనితనాన్ని అలాగే వారు దేశం కోసం కృషిని గురించి అందరికి తెలిసేలా షోలో వివరించనున్నారట. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక క్రికెటర్ ఒక మంచి పనికి సిద్దమయ్యాడు. ప్రముఖ ఛానెల్ స్టార్ ప్లస్ లో షో టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. స్టార్టింగ్ స్టేజ్ లోనే షో ఇంకా మొదలవ్వకముందే జనాల్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ధోని రెస్ట్ లో ఉన్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here