పిక్ ఆఫ్ ది డే: ఇస్మార్ట్ నిశ్శబ్దం

0
886

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టిని అందరు ఇష్టంగా స్వీటీ అని ఎందుకు పిలుస్తారో పైన చూస్తున్న పిక్ చుస్తే అర్దమైపోతోంది. నటీమణుల మధ్య విబేధాలు ఈగోలు ఉంటాయన్న కామెంట్స్ కి ఈ ఫోటో స్వీట్ కౌంటర్ అని చెప్పవచ్చు. అనుష్కతో ఛార్మి ఇచ్చిన స్టిల్ నెటిజన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. గతంలో వీరు వెండితెరపై కలిసి నటించకపోయిన కొన్ని స్పెషల్ ఈవెంట్స్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేశారు.

ఇక చాలా కాలం అనంతరం ఈ ఇద్దరు ఇలా దర్శనమివ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబైలోని ఒక హోటల్ ఇలా ఇద్దరం కలుసుకున్నట్లు చెప్పిన ఛార్మి.. ఇస్మార్ట్ నిశ్శబ్దం అనే ట్యాగ్ ఇచ్చింది. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్దం అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల సినిమాకు సంబందించిన పోస్టర్స్ అండ్ టీజర్స్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఛార్మి పూరి జగన్నాద్ ప్రొడక్షన్ లో కో ప్రొడ్యూసర్ గా కెరీర్ ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here