‘వెంకీమామ’ లో నా క్యారెక్టర్ కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు – హీరోయిన్ రాశి ఖన్నా

0
920

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మ‌ల్టీస్టారర్ `వెంకీ మామ‌`. విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్నారు. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. రాశి ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్ద‌రి హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ రాశి ఖ‌న్నా మీడియాతో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు..

*వెయిట్ తగ్గడానికి చాలా కష్టపడ్డాను. పొద్దున్న లేస్తే జిమ్.. తరవాత షూటింగ్.. మళ్ళీ జిమ్.. అదే నా లైఫ్ అయిపోయింది. నటిగా నిరూపించుకోవాలంటే తప్పదు. అన్ని రకాల అవకాశాలు రావాలంటే మాత్రం కంపల్సరీగా ఫిట్ అవ్వాలి. అది ఇండస్ట్రీ రిక్వైర్ మెంట్.

* నేను విశాల్ అయోగ్య మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు సురేష్ బాబు గారు ఫోన్ చేసి వెంకీ మామ మూవీలో హీరోయిన్ గా చేస్తారా అని అడిగారు. ఆతరువాత నేను ఆయన్ని కలవడం, ఈ మూవీలో చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమాలో హారిక అనే ఫిల్మ్ మేకర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. బాబీగారు నా క్యారెక్జ్టర్ ను చాల బాగా డిజైన్ చేశారు. సినిమాలో నా పాత్ర కూడా కీలకంగానే ఉంటుంది. చై, వెంకీ సార్ కాంబినేషన్ లో సినిమా కావాలని ఎప్పటి నుండో ఫ్యాన్స్ లో డిమాండ్ ఉంది. వాళ్ళిద్దరూ ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఎఫెక్షనేట్, జెంటిల్ గా ఉంటారు. నా క్యారెక్టర్ ఎక్కువగా ఫస్టాఫ్ లో ఉంటుంది. సెకండాఫ్ మ్యాగ్జిమం సినిమా మామా, అల్లుళ్ళదే.

*సినిమాలో సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. నేను, వెంకీ సార్ కాంబినేషన్ లో కూడా సీన్స్ ఉంటాయి. ఆయన దగ్గర చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. మరీ ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా అవకాశం పర్ఫెక్ట్ ప్యాకేజ్ అనిపించింది. సినిమాలో నేను ఫిల్మ్ మేకర్ ని.

*నేను వెంకీ సర్ నటించిన సినిమాలు చిన్నప్పటి నుండి చూసేదాన్ని. టి.వి. లో డబ్బింగ్ సినిమాలు వచ్చేవి. అప్పటి నుండే ఆయన సినిమాలు తెలుసు. కానీ నేను ఆయన స్టార్ గా కన్నా మంచి మనిషిగా నాకు తెలుసు. అందుకే నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ ని. ఒకేసారి 2 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నంత మాత్రాన నాకేం ప్రెజర్ లేదు. యాక్టింగ్ విషయంలో కూడా పెద్దగా డిఫెరెన్స్ అనిపించలేదు. ఒక్క ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కోసమే ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అది చాలా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్.

*నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. సింగర్ గా అవకాశాలు రావాలి కానీ చాలా లక్కీగా ఫీలవుతా. చిన్నప్పుడు నేను మ్యూజిక్ కూడా నేర్చుకున్నా…బాలీవుడ్ లో ఖచ్చితంగా సినిమా చేయాలని రూలేం పెట్టుకోలేదు. మంచి క్యారెక్టర్ అనిపించాలని కానీ లాంగ్వేజ్ ఏదైనా చేసేస్తా.. బాలీవుడ్ లో నాకు చేసేయాలని అనిపించే స్థాయిలో అవకాశాలు రాలేదు అందుకే చేయలేదు.

*నేను అందరూ హీరోయిన్స్ తో చాలా క్లోజ్ గా ఉంటాను. కాంపిటీషన్ ఉన్నా అది రిలేషన్ షిప్స్ కి అడ్డు కాదు అని నా ఫీలింగ్. ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ నా బెస్ట్ ఫ్రెండ్.ఏ సినిమా చేసినా సక్సెస్ అవుతుందనే చేస్తాం… రిలీజయ్యాకే అది ఆడుతుందా..? లేదా అనేది తెలుస్తుంది. సినిమా ఎందుకు ఆడలేదు అనేది తెలియాలన్న అది రిలీజవ్వాల్సిందే. అందునా నేను హిట్స్, ఫ్లాప్స్ పెద్దగా పట్టించుకోను. అవన్నీ కరియర్ లో భాగమే. ఇకపోతే నేను చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినా, అందులో నేను ప్లే చేసిన క్యారెక్టర్ ని ఇష్టపడ్డారు.

*ఇండస్ట్రీ చాలా మారిపోయింది. అమ్మాయిలకు కూడా మంచి క్యారెక్టర్స్ రాస్తుంటారు. నటిగా సమంతా చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే ఇన్స్ పైరింగ్ అనిపిస్తుంది. గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు తను వెబ్ సిరీస్ కూడా చేయబోతుంది. ఇక్కడ అమ్మాయిలు డిసైడ్ అవ్వాలి కానీ ఎక్కడా స్టాపర్ లేదు.

Raashi Khanna – Pics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here