‘వెంకీమామ’ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే మంచి ఎమోషనల్ సబ్జెక్ట్ – స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

0
802

‘కిక్’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యి వరుస విజయాలతో స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంటూ ఫుల్ జోష్ మీదున్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య మల్టీస్టారర్ ‘వెంకీ మామ’ కి సంగీతం అందిస్తున్నారు. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సంధర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంటర్వ్యూ..

మీ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉంది కదా! ఎలా అనిపిస్తోంది?
– నా దగ్గరకు అన్ని మంచి స్క్రిప్ట్స్ వచ్చాయి. మంచి స్క్రిప్ట్ ఎప్పుడూ మంచి పాటలను తీసుకుంటుంది అని నేను నమ్ముతున్నాను. అలాగే మనం కష్టపడి పనిచేస్తుంటే తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. ప్రస్తుతం నా సాంగ్స్ కు విపరీతమైన స్పందన వస్తోందంటే కారణం మంచి స్క్రిప్ట్ లే. నా కన్నా నాకు వచ్చిన అవకాశాలు గొప్పవి.

బేసిక్ గా తొలిప్రేమ నుండి ఈ వేరియేషన్ స్టార్ట్ అయిందా?
– ‘సరైనోడు’ నుండి ఈ బ్రేక్ రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మహానుభావుడు, భాగమతి తొలిప్రేమ, చల్ మోహన రంగ, అరవింద సమేత చిత్రాల్లో సంగీతానికి మంచి పేరు వచ్చింది.

‘వెంకీ మామ’ సినిమా ఎలా ఉండబోతుంది?
– ‘వెంకీ మామ’ ఒక మంచి ఎమోషనల్ సినిమా. బయటకు తెలియట్లేదు గాని, సినిమాలో వెరీ ఎమోషనల్ కంటెంట్ ఉంది. ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. నేను రఫ్ వర్షన్ ను చూసినప్పుడే నేను కంటతడి పెట్టాను. రేపు ఆడియన్స్ కి కూడా సినిమా అంతలా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ బాగాఎంటర్టైన్మెంట్ తో సెకండ్ ఆఫ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

ఎమోషనల్ ఫిల్మ్ అంటున్నారు. ఆ ఎమోషన్ హైలైట్ అయ్యేలా సాంగ్ ఏమైనా ఉంటుందా ?
– ఉంటుందండి! లిరిక్స్ లేని బిట్ సాంగ్ ఉంటుంది. ఇన్ స్ట్రుమెంటల్ గా చేశాం. అది సినిమాలో ఒక లైన్ అందుకే సినిమాలో థీమ్ సాంగ్ లా వస్తోంది.

వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ ఎలా ఉండబోతుంది?
– మామా అల్లుడా అన్నట్లు వెంకటేష్ గారు, నాగ చైతన్య ఇద్దరూ పోటీపడి నటించారు. వెంకటేష్ గారి అనుభవం కూడా సినిమాకి అలాగే చైతుకి ఎంతో హెల్ప్ అయింది. ఇద్దరు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాల బాగా అలరిస్తాయి.

డైరెక్టర్ మీకు మొత్తం స్క్రిప్ట్ తో పాటు సాంగ్స్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలనే అనే విషయాలను చెబుతాడా ?
– సాంగ్స్ ను ఎలా రాయించాలి, సెకెండ్ హాఫ్ లో సాంగ్ ను ఫస్ట్ హాఫ్ కి ఎలా కనెక్ట్ చెయ్యాలి లాంటి విషయాలు డైరెక్టర్ తో చర్చిస్తాను. ఎప్పుడైనా స్క్రిప్ట్ పై డైరెక్టర్ కి ఫుల్ క్లారిటీ ఉంటుంది. అందుకే డైరెక్టర్ ని ఫాలో అవ్వటమే బెటర్. నేను అలాగే ఫాలో అయ్యాను. ఒక విధంగా ఈ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ లా పని చేశాను.

ఒక సాంగ్ కంపోజ్ చేసేటప్పుడే అది మీకు తెలిసిపోతుందా. ఇది క్లిక్ అవుతుందా లేదా అని ?
– 8000 స్టేజ్ షోలు చేసిన అనుభవం అక్కడే కదా ఉపయోగపడేది. ఒక సాంగ్ ను బోర్ కొట్టకుండా ఎలా కంపోజ్ చెయ్యాలి, చేసిన సాంగ్ హిట్ అవుతుందా లేదా అనేది ముందే అర్ధమైపోతుంది.

‘వెంకీ మామ’లో కమర్షియల్ అంశాలు ఎంతవరకు ఉంటాయి ?
– ప్రేక్షుకులు ఫుల్ గా ఎంజాయ్ చేసే అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అయితే ఇది ఎమోషనల్ ఫిల్మ్ కూడా. మెయిన్ గా మహిళా ప్రేక్షుకులు అందరూ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. అలాగే ఈ సినిమాలో వెంకటేష్ గారి డాన్స్ కూడా హైలెట్ గా ఉండబోతుంది. అంత సీనియర్ యాక్టర్ అయినా ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాలో డాన్స్ వేశారు.

సంక్రాంతి సీజన్ లో మీ సినిమాలే ఎక్కువ ఉన్నాయి కదా? ఏమైనా ప్రజర్ ఫీల్ అవుతున్నారా?
-ఏం లేదు! అన్ని పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. మారుతి, త్రివిక్రమ్ లాంటి దర్శకులతో అసలు ప్రాబ్లమ్ ఉండదు. అన్ని ముందే అయిపోతాయి. ఈ సినిమా విషయానికి వస్తే నా పని ముందే అయిపొయింది. అలాగే డిస్కోరాజా సినిమా వర్క్ జరుగుతోంది. సాంగ్స్, టీజర్ కరెక్ట్ గా చూసుకొని విడుదల చేస్తే సరిపోతుంది.

డిఫరెంట్ జోనర్స్ లో వర్క్ చేయడం..
– నా లైఫ్ లో నాకు దొరికిన ఒక గొప్ప అవకాశం డిఫరెంట్ జోనర్ లలో సినిమా చేయడం. అన్ని కమర్షియల్ సినిమాలు అంటే బోర్ కొట్టేదేమో కానీ వివిధ జోనర్లలో పనిచేయడం ఎంజాయ్ చేస్తున్నా.. ప్రతి రోజు పండగే మంచి ఫ్యామిలీ డ్రామా, వెంకీ మామ ఎమోషనల్ స్క్రిప్ట్, అల వైకుంఠపురములో మంచి ఎంటర్టైనర్, డిస్కో రాజా రవితేజ కెరీర్ లోనే ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ ఇలా ప్రతిదీ మిక్స్ అయింది కాబట్టి హ్యాపీ గా ఉన్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here