సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలతో పాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న సూపర్ స్టార్ మహేష్, మధ్యలో కొన్ని మ్యాగజైన్ ల కోసం స్పెషల్ గా ఫోటో షూట్స్ లో పాల్గొంటుంటారు.
ఇక ప్రస్తుతం ప్రముఖ మ్యాగజైన్ వావ్ యొక్క 17వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించబడిన సంచికకు సూపర్ స్టార్ మహేష్ ప్రత్యేక ఫోటోతో కూడిన కవర్ పేజీని రూపొందించడం జరిగింది. డిసెంబర్ సంచికగా అతి త్వరలో ఈ మ్యాగజైన్ మార్కెట్ లో లభ్యం కానుంది. కాగా ఆ కవర్ పేజీ లుక్ లో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ సూట్ లో అదరగొట్టారు . ప్రస్తుతం ఆయన కవర్ పేజీ ఉన్న పిక్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…..!!


