ఇట్స్ రాక్ స్టార్ టైమ్.. గెట్ రెడీ ఫర్ సూపర్ స్టార్ మండేస్..

0
760

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ర‌ష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. అయితే నేడు సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ అప్డేట్ ను అందించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సాంగ్స్ తో ప్రమోషన్ చేయబోతున్నారు.

డిసెంబర్‌లో 5 సోమవారాలను టార్గెట్ చేసుకొని 5 పాటలను రిలీజ్ చేయబోతున్నారు. సినిమాకు బజ్ క్రియేట్ చేయడంలో దేవి శ్రీ ప్రసాద్ సరికొత్తగా అడుగులు వేస్తారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అన్ని సాంగ్స్ ని ఒకేసారి రిలీజ్ చేయకుండా సినిమా విడుదలకు ముందు ఒక్కో పాటను ఒక్కోరోజు రిలీజ్ చేయాలనే ఆలోచన మొదట మన దేవి నుంచే పుట్టింది. ఇక ఇప్పుడు మరోసారి దేవి టైమ్ స్టార్ట్ అయ్యింది. మహేష్ తో చేసిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. సరిలేరు.. టీమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మండెస్ అంటూ ప్రతి సోమవారం ఒక పాటని విడుదల చేయనున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here