అసలు పని ఇప్పుడే మొదలైంది: థమన్

0
497

“అల..వైకుంటపురములో” సినిమాలో సామజవరగమన – రాములో రాముల.. అంటూ థమన్ ఇచ్చిన ట్యూన్స్ ఎంత పెద్ద హిట్ అయ్యయో తెలిసిందే. సినిమాకు సంబంధించిన అసలు పని ఇప్పుడే మొదలయ్యింది అంటున్నారు సంగీత దర్శకుడు థమన్. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన రీ రికార్డింగ్ పనులు ఊపందుకున్నాయి.

”సామజవరగమనా, రాములో రాముల విడుదల చేసి హిట్ అయినందున నేను రిలాక్స్ అవ్వడం లేదు. ఒత్తిడి ఎల్లప్పుడూ ఉంటుంది, నేను ప్రతి పాటతో ఎదగడానికి ప్రయత్నం చేస్తాను. వాటి నుంచి చాలా నేర్చుకుంటాను. పాటను హిట్ చేయడానికి మా ప్లాన్ సిద్ధంగా ఉంటుంది. ఆ విజయం రావడానికి మా టీమ్ లో ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు” అని థమన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

ఈ సినిమాతో పాటు ప్రస్తుతం థమన్ వెంకీ మామా – ప్రతిరోజు పండగే సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రవితేజ డిస్కో రాజా సినిమాకు వర్క్ చేస్తున్న థమన్ తీరిక లేకుండా మ్యూజిక్ తో కాలాన్ని గడిపేస్తున్నారు. నెక్స్ట్ వరుణ్ తేజ్ కొత్త సినిమాకు కూడా ఈ క్రియేటివ్ కంపోజర్ ట్యూన్స్ అందించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here