‘RRR’ లో ఎన్టీఆర్ హీరోయిన్, విలన్స్ వీరే…!!

0
1196

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుందని, నిన్న సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కాసేపటి క్రితం రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్.

‘జెన్నిఫర్’ అనే పాత్రలో ఆమె నటిస్తున్న ఈ సినిమాలో మెయిన్ విలన్ ‘స్కాట్’ పాత్రలో నటిస్తున్న రే స్టీవెన్సన్, మరియు లేడీ విలన్ ‘లేడీ స్కాట్’ గా నటిస్తున్న ఆలిసన్ డూడీ తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్లని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా నుండి అధికారిక అప్ డేట్ కోసం ఎంతగానో ఎదురు చూసిన ప్రేక్షకులకు ఈ న్యూస్ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, స్వరవాణి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020 జులై 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here