జార్జిరెడ్డి.. సెన్సార్ ఫినిష్

0
726

జార్జి రెడ్డి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు. ఓయూ లెఫ్ట్ వింగ్ విద్యార్థి, నేత జార్జి రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ఇటీవల ముగిశాయి. సెన్సార్ బోర్డ్ నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

ఇక 153 నిమిషాల నిడివి కలిగి ఉన్న జార్జి రెడ్డికి సెన్సార్ బోర్డ్ UA సర్టిఫికెట్ ని జారీ చేసింది. సినిమాలో  ఎమోషన్స్ తో పాటు పలు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. జార్జి రెడ్డిగా వంగవీటి ఫెమ్ సందీప్ మాధవ్ నటించిన విషయం తెలిసిందే. 25 ఏళ్లకే ఓయూ లో దారుణంగా హత్య చేయబడ్డ జార్జి రెడ్డి మరణానికి దారి తీసిన కారణాలు ఈ సినిమాలో చూపించనున్నారు. సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా సాంగ్ ని రిలీజ్ చేసి మంచి బూస్ట్ ఇవ్వగా మరికొంత మంది హీరోలు చిత్ర యూనిట్ కి స్పెషల్ విషెస్ అందించారు. ఇక సినిమాలో సత్యదేవ్ మరొక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన జార్జి రెడ్డి చిత్రాన్ని అప్పి రెడ్డి – సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here