`బీచ్ రోడ్ చేతన్` ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ – చేతన్ మద్దినేని.

0
1128

‘రోజులు మారాయి’, ‘గల్ఫ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’, చిత్రాల‌తో న‌టుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు చేతన్ మద్దినేని. ప్ర‌స్తుతం ఆయ‌న తొలిసారిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న రా అండ్ రియలిస్టిక్ రస్టిక్ ఫిలిం “బీచ్ రోడ్ చేతన్”. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సంధర్భంగా హీరో చేతన్ మద్దినేని ఇంట‌ర్వ్యూ…

`బీచ్ రోడ్ చేతన్` గురించి చెప్పండి?
– మూవీ ఒక రియలిస్టిక్ రా ఎంటర్ టైనర్. ట్రైలర్ చూస్తే సినిమా ఏంటి అనేది కొంతవరకూ అర్ధం అవుతుంది. ఒక సింపుల్ రివెంజ్ డ్రామా స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్ గా ఉంటుంది.. ఈ సినిమా అంతా డీప్ అండ్ ఇన్నర్ మీనింగ్ తో సాగుతుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఒక్క సీన్ మిస్ అయినా ఆడియన్స్ లింక్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సినిమా అంతా టైమ్ ట్రావెల్, రీకలెక్టింగ్ మెమరీస్ గురించి ఉంటుంది. ఒక ఫోన్ ద్వారా అతను ఎవరి మెమోరీస్ లోకి అయినా వెళ్లగలడు అనే పాయింట్ ఉంటుంది.

ఈ సినిమాకి దర్శకత్వం, నిర్మాణం రెండు మీరే ఎందుకు చేయాల్సి వచ్చింది?
– నేను ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అయింది. ఎప్పటినుండో ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలని కోరిక బాగా ఉండేది. అయితే నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాక కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి డైరెక్ట్ చేశాను. అదే టీమ్ తో చేస్తున్న సినిమా ఇది. ఇలా సినిమా తీస్తాను అని మా డాడీ కి చెప్పడం జరిగింది. అలా నా సేవింగ్స్, పాకెట్ మనీ తో తీసిందే ఈ సినిమా. నిజానికి నాకు మొదటి నుంచీ డైరెక్షన్ మీద ఇంట్రస్ట్ ఉంది. కానీ అనుకోకుండా దిల్ రాజు గారి బేనర్ లో హీరోగా అవకాశం వచ్చింది. అలా ‘రోజులుమారాయి’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాను.

ఫ్రీగా ప్రీమియర్ షోలు వేయాలని ఎందుకు అనిపించింది?
– దానికి రీజన్ ఉంది ఏంటంటే బేసిక్ గా చిన్న మూవీస్ ను ఎవ్వరు పట్టించుకోరు. పట్టించుకోవాలంటే అన్ లైన్ లో ఆ మూవీ టీజర్ నో ట్రైలర్ నో వైరల్ అవ్వాలి. అలా వైరల్ అయ్యే కంటెంట్ కాదు కాబట్టి ఈ సినిమా ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రీమియర్ షోలు వేయటం జరుగుతుంది. దీని ద్వారా సినిమా టాక్ అనేది బయటకు వచ్చి మరింత మందికి తెలిసే అవకాశం ఉంటుందని నమ్మకం. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా ?లేదా? అనేది ఇండస్ట్రీ తో పాటు నేను తెలుసుకోవాలనుకుంటున్నా..

ఆడియన్స్ ఫ్రీగా సినిమా ఎలా చూడొచ్చు?
– ముఖ్యం గా ఈ ఫ్రీగా సినిమా చూడొచ్చు అన్న కాన్సెప్ట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్లే వారి కోసం కాదు. ఎవరైతే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని థియేటర్ కి వెళ్తున్నారో వారి కోసమే. సింగిల్ స్క్రీన్స్ లో థియేటర్స్ దగ్గర మేమే టికెట్స్ ఇస్తున్నాము. ఇక మల్టీప్లెక్స్ లో మా సినిమా ఏజెంట్ ఉంటాడు అతడు టికెట్స్ ఇస్తాడు. ఒకవేళ బుక్ మై షోలో ఎవరైనా టికెట్స్ ముందుగానే బుక్ చేసుకుంటే.. థియేటర్ దగ్గర మా ఏజెంట్ ను కలిస్తే మీకు టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాడు.

దర్శకత్వంలో మీకు అనుభవం లేదు కదా! ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?– నాకు డైరెక్షన్ పరంగా నాకు అనుభవం లేదు. డైరెక్షన్ ఎలా చేయాలి, షాట్ మేకింగ్ గురించి ఇలా 24 క్రాఫ్ట్ లకు సంబంధించి విషయాలు ఆన్ లైన్ లోనే చూసి నేర్చుకున్నాను.

ఫస్ట్ ర్యాంక్ రాజు తరువాత మీకు ఆఫర్స్ రాలేదా?
– ఫస్ట్ ర్యాంక్ రాజు తరువాత ఆల్ మోస్ట్ 8 ,9 సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా రిలీజ్ తరువాతే.. నెక్స్ట్ మూవీ గురించి ఆలోచిద్దామని వచ్చిన అవకాశాల్ని హోల్డ్ లో పెట్టాను. ఈ సినిమా పై నాకు అంత నమ్మకం ఉంది.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– రెండు సబ్జెక్టులు ఉన్నాయి. హారర్ కామెడీ ఒకటి. అండ్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ ఇంకొకటి. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here