సుప్రీం హీరో సాయి తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో జిఏ2, యూవి పిక్చర్స్ బేనర్ లో ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో బన్నీవాస్ నిర్మిస్తున్న చిత్రం “ప్రతిరోజు పండగే”. సత్య రాజ్, రావు రమేష్, విజయ్ కుమార్, మురళి శర్మ, అజయ్, గాయత్రీ భార్గవి, హరితేజ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైనటీజర్, టైటిల్ ట్రాక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా ప్రస్తుతం ఈ చిత్రం నుండి రెండవ పాట ఓ బావా!ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా..
ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – ” మారుతి గారు నాకు ఒకేసారి కథ చెప్పారు. తన టైమింగ్ మీద ఉన్న నమ్మకం, ఆ టైమింగ్ ని తేజు బాగా పండించగలడని నమ్మకం తో ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. మారుతి గారు గతంలో కూడా నేను అనుకున్నదానికంటే ఎక్కువే డెలివర్ చేశారు. ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ చేస్తారు అనుకుంటున్నాను. రాశి గారిని ఏంజెలా క్యారెక్టర్ లో చూసి షాక్ అయ్యాను. తేజు ఫస్ట్ మూవీ ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఇద్దరం కలిసి వర్క్ చేశాం. ఈ సినిమాతో మా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ రాశిఖన్నా మాట్లాడుతూ – “ఈ సినిమా కోసం నిజంగా చాలా కష్టపడ్డాను. నా మీద నమ్మకంతో ఇంత మంచి పాత్ర ఇచ్చిన మారుతి గారికి థాంక్స్. నా క్యారెక్టర్ తో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ఇక ఓ బావ పాట గురించి మాట్లాడాల్సి వస్తే తప్పకుండా థమన్ గురించి మాట్లాడాలి. థమన్ గారు న కెరీర్ లో చాలా మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి. లిరిక్స్, మ్యూజిక్ చాలా బాగా కుదిరాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. డిసెంబర్ 20 అందరూ థియేటర్ లో సినిమా చూడండి” అన్నారు.
హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ” లాస్ట్ ఇయర్ తర్వాత ఏదయినా మంచి సినిమా తీయాలి అని రకరకాల కథలు అనుకోవడం జరిగింది. అనుకోకుండా కుటుంబకథా చిత్రం తీసుకోవడం జరిగింది. ఫ్యామిలీ సినిమా అనగానే సోషల్ మీడియాలో గతంలో వచ్చిన కుటుంబకథాచిత్రాలతో పోల్చడం పరిపాటి అయిపోయింది. అయితే ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకూ రాని పాయింట్ తో ‘ప్రతిరోజు పండగే’ తెరకెక్కింది. ఎందుకంటే చాలా మంచి విషయాన్ని ఎంటర్టైన్ చేస్తూ చెప్పడం జరిగింది. పుట్టినప్పుడు ఎలాగైతే సెలబ్రేషన్ చేస్తామో అలాగే ఒక వ్యక్తి చనిపోతున్నాడు అని తెలిసినప్పుడు కూడా సంతోషంగా తనకి బెస్ట్ సెండాఫ్ ఇవ్వడం అనేది కూడా మన భాద్యతే అనే పాయింట్ ని అంతర్గతంగా చెప్పడం జరిగింది. ప్రస్తుత సమాజంలో తన తండ్రికి పంచాల్సిన ప్రేమను కూడా తమ పిల్లలకు పంచుతున్నారు. తండ్రిని మర్చిపోతున్నారు. అలాంటి సందర్భంలో తండ్రికి ఎంత వాల్యూ ఇవ్వాలని అనేది మంచి ఎంటర్టైన్ చేస్తూ కచ్చితంగా అందరికీ నచ్చే విధంగా హార్ట్ టచింగ్ గా ఉండేలా సినిమా ఉండబోతుంది. కొన్ని సీన్లు ఎడిట్ చేసేటప్పుడు సత్యరాజ్ గారి నటన చూస్తే నాకే కన్నీళ్లు వచ్చాయి. రేపు థియేటర్స్ లో ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఇంత మంచి కథ యాక్సప్ట్ చేసిన తేజు, రాశి లకు థాంక్స్. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అందించాలని మా టీమ్ అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. అలాగే ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చిన నా స్నేహితులు బన్నీ వాసు, వంశి, విక్కీ లకు థాంక్స్. ఇలాగే మా మెయిన్ పిల్లర్ అరవింద్ గారు ఆయనకు కథ చెప్పగానే మంచి కథ, చాలా మంచి పాయింట్ తీసుకున్నావ్ . మంచి ఫీల్ ఉంది డెఫినెట్ గా చేద్దాం అని అన్నారు. అలా ప్రతి ఒక్కరికి నచ్చి ప్రేమించి చేసిన సినిమా ఇది. నా భలే భలే మొగాడివోయ్ స్క్రిప్ట్ మొదట చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రతి రోజు పండగే స్క్రిప్ట్ కూడా చిరంజీవి గారికి చెప్పను. మంచి హెల్తీ స్క్రిప్ట్ తీసుకున్నావ్ అన్నారు. ఆయన ఇచ్చిన ఎనర్జీ తో ఈ సినిమా షూటింగ్ కంప్లిట్ చేసుకున్నాం. మంచి మ్యూజిక్ అందించిన థమన్ సహా ప్రతి ఒక్క టెక్నీషన్స్ కి థాంక్స్. మిగతా పాటలు కూడా అన్ని వర్గాల వారికి ఆకట్టుకుంటాయి.” అన్నారు.
సుప్రీం హీరో సాయి తేజ్ మాట్లాడుతూ – ” సినిమాస్టార్ట్ చేసిన దగ్గరనుండి మంచి సపోర్ట్ అందిస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్.యష్ మాస్టర్ కొరియోగ్రఫీ అదరగొట్టాడు. మాకు అందరికీ ఇంత ఎనర్జీ రావడానికి కారణం థమన్. ఐదు పాటలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మారుతి గారు ఫస్ట్ నాకు ఒక పదిహేను నిమిషాల లైన్ చెప్పారు. చాలా బాగుంది అన్నాను. తర్వాత ఒక వారం రోజుల్లోనే పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేసి చెప్పారు. నాతో పాటుసత్య రాజ్, రావు రమేష్, విజయ్ కుమార్, మురళి శర్మ, అజయ్ ఇలా ప్రతి క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. రాశి క్యారెక్టర్ ప్రజెంట్ టిక్ టాక్ ట్రెండ్ నుండి తీసుకోవడం జరిగింది. బెల్లం శ్రీదేవి తర్వాత మళ్ళీ ఈ సినిమాలో చేసిన ‘ఏంజెలా’ క్యారెక్టర్ అందరికి గుర్తిండిపోతుంది. ఇదొక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్” అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్, లిరిసిస్ట్ కె.కె, యష్ మాస్టర్, నటుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం – మారుతి
సమర్పణ – అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ – బన్నీ వాస్
కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – బాబు
డిఓపి – జయ కుమార్
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను


