యూట్యూబ్ లో 100 మిలియన్ల కొట్టిన ఇస్మార్ట్ శంకర్ ‘దిమాక్ ఖరాబ్’ సాంగ్….!!

0
559
Ismart shankar

యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కంబినేషన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్, పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సాంగ్స్ అన్ని కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే వాటిలో ‘దిమాక్ ఖరాబ్’ అనే పల్లవితో సాగె మాస్ సాంగ్, యువతను మరియు మాస్ ఆడియన్స్ ను మరింతగా ఊపేసిందనే చెప్పాలి. ఇకపోతే ఈ సాంగ్ నేడు ఒక అద్భుతమైన రికార్డుని సొంతం చేసుకుంది.

ఈ ఏడాది రిలీజ్ అయిన సాంగ్స్ లో ఈ ‘దిమాక్ ఖరాబ్’ సాంగ్ లిరికల్ గా అలానే వీడియో సాంగ్ వ్యూస్ పరంగా, మొత్తం కలిపి 100 మిలియన్లకు పైగా యూట్యూబ్ వ్యూస్ దక్కించుకుని, ఇప్పటికీ యూట్యూబ్ లో తిరుగులేకుండా దూసుకుపోతోంది. రామ్ ఫ్యాన్స్ ఈ విషయమై ఎంతో ఆనందంతో తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here