మాస్ బీట్ తో అదరగొట్టిన ‘వెంకీ మామ’ ఫస్ట్ సాంగ్….!!

0
369

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్యల కలయికలో యువ దర్శకుడు కె ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘వెంకీ మామ’ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ మరియు ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించాయి. నేడు ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ గా ‘వెంకీ మామ’ అంటూ సాగె టైటిల్ ట్రాక్ ని యూట్యూబ్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. తన మామయ్య గురించి మేనల్లుడు ఎంతో గొప్పగా చెప్తూ మాస్ స్టైల్ బీట్ తో సాగిన ఈ సాంగ్ కి థమన్ అందించిన మ్యూజిక్ పెద్ద అసెట్.

ఇక ఈ సాంగ్ ను సింగర్ శ్రీకృష్ణ ఆలపించగా, ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించడం జరిగింది. ఈ లిరికల్ వీడియోని బట్టిచూస్తే పల్లెటూరి వాతావరణంలో మామ, అల్లుళ్లయిన వెంకటేష్, చైత్యన్యల మధ్య ఈ సాంగ్ ని ఎంతో గ్రాండ్ గా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని అతి త్వరలో ఖరారు చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here