అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా నిశ్శబ్దం. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని సంపాదించడం జరిగింది. ఇకపోతే నేడు అనుష్క పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. పూరి జగన్నాథ్, గౌతమ్ మీనన్, నీరజ్ పాండేలు తెలుగు, తమిళ మరియు హిందీ టీజర్స్ ని తమ చేతుల మీదుగా యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఆద్యంతం ఆకట్టుకునే సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ ఘటనలతో సాగిన ఈ టీజర్, సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. టీజర్ ని బట్టి,
హ్యాపీగా వెకేషన్ కోసం ఒక ఇంటికి వెళ్లిన జంటకి జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమా కథ సాగనున్నట్లు మనకు అర్ధం అవుతుంది. సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో అనుష్క నటిస్తుండగా, ఆంథోనీ అనే సెలబ్రిటీ మ్యుజీషియన్ గా మాధవన్, మహా అనే క్రైమ్ డిటెక్టీవ్ ఆఫీసర్ గా అంజలి, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, షాలిని పాండే తో పాటు హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వండర్ ఫుల్ విజువల్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు, హాంటింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సాగిన ఈ టీజర్, ప్రస్తుతం మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను కోన వెంకట్, టిజి విశ్వ ప్రసాద్ కలిసి కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!