రియలిస్టిక్ గా ఉండే కమర్షియల్ యాస్పెక్ట్స్ ఉన్నచిత్రం ‘తిప్పరా మీసం’ – యంగ్ హీరో శ్రీవిష్ణు

0
795

భిన్నమైన కథలను ఎంచుకుంటూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు. ‘బ్రోచేవారేవరురా’ వంటి డీసెంట్ హిట్ తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం “తిప్పరా మీసం”. అసుర ఫేమ్ విజయ్ కృష్ణ  ఎల్. దర్శకత్వంలో శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణవిజయ్.ఎల్ ప్రొడక్షన్స్  పతాకాలపై  యువ నిర్మాత రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిక్కి తంబోలి హీరోయిన్ గా నటించింది.  ఈ చిత్రం నవంబర్ 8న వరల్డ్ వైడ్ గా గ్లోబల్ సినిమాస్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతోన్న సందర్భంగా హీరో శ్రీ విష్ణు ఇంటర్వ్యూ..

ఈ సినిమాలో మీ లుక్ డిఫరెంట్ గా ఉంది! దీనికి ప్రత్యేక మైన రీజన్ ఉందా?
– ప్రత్యేక మైన రీజన్ అంటూ ఏం లేదండీ! కాకపోతే నా క్యారెక్టర్ నైట్ క్లబ్ లో పనిచేసే డిజె. వాడికి నచ్చిన స్టైల్ లో ఉంటాడు. కొంత కాంట్రాస్ట్ క్యారెక్టర్ కాబట్టి మాస్ అప్పీల్ ఉంటుంది. అందుకే గడ్డం పెంచాను. దానికి తోడు ఈ సినిమా కోసం నేను 8 కిలోల వరకూ వెయిట్ పెరిగాను. దాని వ‌ల్ల‌ అప్పీరియన్స్ పరంగా కొంత స్ట్రాంగ్ గా కనిపిస్తాను.

కామెడీ సినిమాలకు ఎక్కువ రీచ్ ఉంటుంది కదా! ఇలాంటి టైమ్ లో కల్ట్ మూవీ అంటే రిస్క్ అనిపించిందా?
– మనం ముందే బ్యారియర్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే కామెడీ సినిమాలకు కొంత రీచ్  అయితే ఉంటుంది కానీ అదే లిమిట్ కూడా కాదు. అలా అయ్యుంటే  కామెడీ మీదే ఎక్కువ సినిమాలు వచ్చేవి.  కామెడీ డెఫినెట్ గా రిలీఫ్ ఉంటుంది కానీ కంటెంట్ కూడా ముఖ్యమే. కంటెంట్ లేకపోతె ఆడియన్ ఆ ఫీల్ తో బయటకు రాడు. దానివ‌ల్ల‌ఎవరికీ చెప్పడు. అలా కాకుండా కామిడీ కుదిరి కంటెంట్ కూడా ఉంటే ఆడియన్ ఎంజాయ్ చేస్తాడు అలాగే నలుగురికి చెప్తాడు.

ఈ సినిమాలో కామెడీ ట్రాక్ గురించి?
– మీరు బ్రోచేవారెవరురా సినిమా తీసుకుంటే అందులో క్యారెక్టర్స్ చేసే పనుల వ‌ల్ల‌ మీకు నవ్వు వస్తుంది తప్ప సపరేట్ కామెడీ ట్రాక్ అంటూ ఏం ఉండదు. అలానే ఈ సినిమాలో నేను చేసే పనుల వల్ల మీరు నవ్వుకుంటారే తప్ప సపరేట్ కామెడీ ట్రాక్ ఉండదు.

సినిమాలో మీసం తిప్పే సన్నివేశం ఒకటి చెప్పండి?
– మాములుగా అందరూ ఏదయినా పందెం కాసినప్పుడో, పౌరుషాలు చూపించాలన్నప్పుడో మీసాలు తిప్పడం ఆనవాయితి. అలాగే ఈ సినిమాలో కూడా వీడికి తెలీక చాలా సార్లు అలాగే తిప్పుతాడు.. కానీ మా పాయింట్ ఏంటంటే ప్రతి మగాడికి మీసం అనేది రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ ని మనం నిలబెట్టుకుని  ఆ ప్రైడ్ మూమెంట్ ని తీసుకున్నపుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే లైన్ ను అండర్ కరెంట్ గా చూపించాం.
 
ఈ మూవీ బాగా ఆలస్యం ఐనట్టుంది ?
– బ్రోచేవారెవరురా మూవీ జూన్ లో వచ్చింది. వెంటనే మరో మూవీ విడుదల చేయడం ఎందుకు అనే ఆలోచనతో పాటు, సాహో, సైరా వంటి పెద్ద చిత్రాల విడుదల కూడా ఉండటంతో రిలీజ్ ఆపడం జరిగింది. ప్రొడక్షన్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న టైంకే పూర్తయ్యాయి.

మీ డైరెక్టర్ కృష్ణ విజయ్ గారితో బ్యాక్ టు బ్యాక్ అసోసియేట్ అవ్వడం..
– ఆయనతో అసోసియేషన్ చాలా బాగుంది కాబట్టే ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తున్నాం. అదికాక నేను చేసిన డైరెక్టర్స్ అందరూ మళ్ళీ నాతో సినిమా చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే అది నాకు హ్యాపీ మూమెంట్ కూడా..నాతో కంఫర్ట్ అంటే టైమ్ కి వెళతాను, డైరెక్టర్ చెప్పింది చేస్తాను.. అంతకు మించి నాకు ఏం తెలీదు.
 
‘బ్రోచేవారెవరురా’  తరువాత రెమ్యూనరేషన్ పెంచారా?
– బ్రోచేవారెవరురా మూవీకి ముందే నేను నాలుగు ప్రాజెక్ట్స్ కమిట్ ఐయ్యాను. కాబట్టి ఆ చిత్రాల విషయంలో రెమ్యూనరేషన్ పెంచమని అడుగలేదు. అలా అడగడం కూడా న్యాయం కాదు. ఈ నాలుగు సినిమాలకు కూడా రీచ్ బాగా ఉంటే ఇకపై చేసే చిత్రాలకు పెంచుతానేమో .

 ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి  మథర్ ఎమోషన్ కారణమా?  
–  మథర్ ఎమోషన్ సినిమాతో లింక్  అయ్యి ఉంటుంది అది ఒకటి. అది కాకుండా తెలుగులో ఇప్పటి వరకూ చూడని కొన్ని సీక్వెన్సులు  ఒక మూడు నాలుగు ఈసినిమాలో కుదిరాయి.  కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువగా వస్తున్న టైములో ఈ సినిమాలో రియలిస్టిక్ గా ఉండే కమర్షియల్ యాస్పెక్ట్ యాడ్ అవడం కొత్తగా అనిపించింది. డ్రామాకు యాక్షన్ కుదిరితే చాలా బాగుంటుంది. అది బాగా నచ్చి ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడం జరిగింది.

మీ దృష్టిలో కమర్షియాలిటీ అంటే?
– సినిమా ఎక్కువ మందికి రీచ్ అవడమే… కాన్సెప్ట్ ఫిలిమ్స్అనేవి  ఏ సెంటర్ సినిమాగా గుర్తింపు తెచ్చుకొని  మల్టీప్లెక్స్, యూఎస్ తో ఆగుతున్నాయి. బి సి సెంటర్స్ లో రీచ్ తక్కువగా ఉంటుంది. అందుకే బి సి సెంటర్స్ వారు ఏ అంశాలనైతే కోరుకుంటారో అవి ఈ సినిమాలో పెట్టడం జరిగింది.

అంటే ఈ సినిమాలో కంటెంట్, కమర్షియాలిటీ రెండు ఉన్నాయా?
– రెండు ఉన్నాయనే చెప్పాలి. డెఫినెట్ గా మంచి కంటెంట్ ఇక కమర్షియాలిటీకి వస్తే తొడకొట్టడాలు, మీసం తిప్పడాలు అలా ఆ కోణంలో కాదు, రియలిస్టిక్ గా ఎక్కువమందికి చేరే అంశాలు ఈ మూవీలో ఉన్నాయి. ఈ సినిమా తరువాత ..నన్నే అలా చూపించాడు అంటే ఈ డైరెక్టర్ మరో హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకునే రేంజ్ లో సినిమా ఉంటుంది.

సీనియర్ నటి రోహిణి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్?
–  ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ నేను మదర్ రిలేటెడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. రోహిణి గారు నా మదర్ గా నటించారు. అయితే ఆమె ఒక్క టేక్ లో చాలా ఫాస్ట్ గా చేసేస్తారు. సీనియర్ అని మొదటి కొంచెం భయం వేసింది. ఐతే ఆమెతో పరిచయం ఏర్పడ్డాక ఆ భయం  పోయింది. నేను ఇప్పటివరకూ కలిసి పనిచేసిన నటులలో ఆమె బెస్ట్.

ప్రీ రిలీజ్ లో వినాయక్ మాట్లాడుతూ శ్రీ విష్ణు ఇండస్ట్రీ లో మంచి గౌరవం సంపాదించుకున్నాడు అన్నారు కదా! అలాంటి మాటలు వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?
–  సాధారణంగా నేను చేసే ఫిలిమ్స్ కి రెస్పెక్ట్ కోరుకుంటాను. దాంతో పాటు నాకు రెస్పెక్ట్ వస్తుంది అన్నందుకు ఐ యాం వెరీ హ్యాపీ.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
–  మూడు ప్రాజెక్ట్స్ ఫైనల్ కావడం జరిగింది. ముగ్గురు కొత్త డైరెక్టర్స్. ఐతే ఏది ముందు స్టార్ట్ అవుతుంది అనేది ఇంకో వారం రోజులో తెలియజేస్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు యంగ్ హీరో శ్రీవిష్ణు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here