డిస్కో రాజా’ లో బాబీ సింహా లుక్ రిలీజ్.

0
368

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా డిస్కో రాజా. ఒక వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు ‘నువ్వు నాతో ఏమన్నవో’ అనే పల్లవితో సాగె లిరికల్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయి, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇకపోతే నేడు నటుడు బాబీ సింహా జన్మదినం సందర్భంగా, ఈ సినిమాలో విలన్ గా ఆయన పోషిస్తున్న ‘బర్మా సేతు’ అనే పాత్ర తాలూకు అఫీషియల్ లుక్ ని సినిమా యూనిట్ కాసేపటి క్రితం రిలీజ్ చేసింది. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకు ఫోటోగ్రఫిని కార్తీక్ ఘట్టమనేని అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here