వెంకీ మామ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

0
295

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జైలవకుశ సినిమాల దర్శకుడు కే ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, పల్లెటూరి నేపథ్యంలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగనున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ సినిమాలో వెంకటేష్ రైతుగా, నాగచైతన్య సైనికుడిగా కనిపించబోతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో పాటు సినిమాపై వారిలో బాగా అంచనాలు పెంచింది.

ఇకపోతే ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్ ని రేపు సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై సురేష్ బాబు, టి జి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here